బిగ్ సంచలనం: డేటింగ్ కన్ఫామ్ అయ్యిందా..? పున్ను సిగ్నల్ ఇచ్చిందా..?

Tuesday, September 17th, 2019, 04:00:38 PM IST

బిగ్ బాస్ షో అంటేనే నవరసాలు మిళితమై ఉంటాయి, వాటిలో శృంగారసానికి కొంచం ఎక్కువ స్క్రీన్ టైమింగ్ దొరుకుంటుంది ఈ షో లో, ప్రతి భాషలో, ప్రతి సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ లు అనేవి సహజం. ఇంకా మన తెలుగులో కొంచం తక్కవే కానీ, హిందీలో అయితే అవి ‘నెక్స్ట్ లెవెల్” లో ఉంటాయి. మన తెలుగులో కూడా ఈ సీజన్ లో రాహుల్ -పునర్నవి రూపంలో ఒక జోడి కనిపిస్తుంది.

మొదటి నుండి వీళ్లిద్దరి మధ్య మంచి ర్యాపో కనిపిస్తుంది. ఇద్దరు హౌస్ లో ఎన్ని సార్లు తిట్టుకొని గొడవలు పడిన కానీ, సాయంత్రం అయ్యేసరికి ఒకే చోట కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు, లవ్ గురించి, డేటింగ్ గురించి మాట్లాడుకునే వాళ్ళు. ఆలా ఆలా ఇద్దరి మధ్య రిలేషన్ ‘నెక్స్ట్ లెవెల్’ కి చేరుకుంది. అవన్నీ చూస్తున్న ప్రేక్షకులకి వాళ్ళ మధ్య ‘ఎదో’ నడుస్తుందని ఒక అంచనాకి వచ్చారు. చివరికి నాగార్జున కూడా ఈ విషయంపై పునర్నవిని అడిగి ఒక క్లారిటీకి వచ్చాడు.

ఇక తాజాగా హౌస్ లో పునర్నవి కోసం రాహుల్ ఏకంగా 20 గ్లాసులు కాకరకాయ జ్యూస్ తాగటం జరిగింది. దానితో పునర్నవి రాహుల్ ని చూసి కరిగిపోయింది. అతని హాగ్ చేసుకొని కిస్ చేసింది. దీనితో ఇద్దరి మధ్య రిలేషన్ గురించి అందరు మాట్లాడుకునే స్థాయికి తీసుకొనివెళ్ళారు. మరి ఈ బంధం హౌస్ లోనే వుంటుందా లేక బయటకు వచ్చాక కూడా కొనసాగిస్తారా అనేది చూడాలి.