బిగ్ ప్లాష్ : పునర్నవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రాహుల్

Friday, September 13th, 2019, 04:15:54 PM IST

బిగ్ బాస్ సీజన్ 3 లో మంచి జోడిగా పేరు తెచ్చుకున్న హౌస్ మేట్స్ రాహుల్ మరియు పునర్నవి. వీళ్ళ గురించి హౌస్ లోను, హౌస్ బయట కూడా పెద్ద రూమర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కంటే కూడా అంతకుమించి ఎదో ఉందని అందరు అనుకుంటారు. హౌస్ లో వాళ్ళు వుండే విధానం కావచ్చు, ఒకరి మీద ఒకరు చూపించుకునే అభిమానం కావచ్చు, చూసేవాళ్ళుకి వాళ్ళ ఇద్దరిలో ఇంకో కోణం కనిపిస్తుంది.

తాజాగా హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఇందులో పోటీదారులు గార్డెన్ ఏరియాలో ఒక బాక్స్ లో ఉన్న జెండాలను ఒకరి వీపు ఎక్కి అవతలి వైపు ఉన్న బాక్స్ లో వేయాలి, ఎండ్ బజర్ మోగేసమయానికి ఎవరు ఎక్కువగా జెండాలను పెడితే వల్లే విజేతలు. ఇందులో వితిక పోటీదారునిగా ఉంది. ఆమె తనని మోయటానికి రాహుల్ అయితే సరిపోతాడని అతన్ని అడుగుతుంది. ఆ సమయంలో వీడు ఎందుకు..కాళ్ళు నొప్పి, చెయ్యి నొప్పి అని సతాహిస్తాడని పునర్నవి చెప్పటంతో వితిక వరుణ్ తో కలిసి టాస్క్ అడుగుతుంది గెలుస్తుంది.

ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో రాహుల్ సీరియస్ గా పునర్నవి దగ్గరకి వచ్చి, నువ్వు ఎందుకు మధ్యలో వచ్చి కాళ్ళు నొప్పి, చేయి నొప్పి అని చెపుతాడు, నేను వితిక వరుణ్ మాట్లాడుకుంటున్నాం కదా..! ఎందుకు నా గురించి ఆలా మాట్లాడుతావు అంటూ అన్నాడు. దీనితో పునర్నవి నేనుమీ తప్పుగా అనలేదు. నీ గురించి తెలుసు కాబట్టే అన్నాను, నువ్వు ఏది కూడా సరిగ్గా చేయవు కదా అని అనేసరికి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడమకాని రాహుల్ అనటంతో వితిక పునర్నవి పక్కకి తీసుకొనివెళ్తుంది. ఆ తర్వాత పునర్నవి వచ్చిన కానీ రాహుల్ మాట్లాడకుండా వెళ్ళిపో అని చెప్పుతాడు,. అయితే వీళ్ళ అలక ఎన్ని గంటలు ఉంటుందో అనేది ఆ బిగ్ బాస్ కే తెలియాలి.