మాస్ మహారాజ “డిస్కో రాజా” మిస్ కావొద్దు!

Wednesday, March 25th, 2020, 11:46:59 AM IST

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజను ప్రేమించని వారు ఉండరు. అతని డెడికేషన్ ఇంత స్టేజ్ కు తీసుకొచ్చింది.కానీ రవితేజ కు మాత్రం ఇప్పుడు ఏమంత టైం కలిసి రావడం లేదు. ఎప్పుడు మాస్ మసాలా సినిమాలు తీస్తే వర్కౌట్ అవ్వడాన్ని ఈరోజుల్లో సరికొత్త సబ్జెక్టు తో వస్తేనే ఆకట్టుకుంటారు అని వైవిధ్య చిత్రాల దర్శకుడు వి ఐ ఆనంద్ తో “డిస్కో రాజా” అనే ఓ వినూత్న సబ్జెక్టు తో వచ్చినా అది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు.కానీ సబ్జెక్టు ప్రకారం చూస్తే ఈ సినిమా ఊహించిన దానికంటే అనేకన్నా ఊహలకు అందంఅతలా ఉంటుందని చెప్పొచ్చు.

అక్కడక్కడా కాస్త స్లో అనే మాట తప్ప ఇందులో ట్విస్టులు నిజంగానే ఊహలకు అందని విధంగా ఉంటాయి. మంచి స్కై ఫై థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి మాత్రం ఖచ్చితంగా ఈ చిత్రం మంచి ఛాయిస్ అవుతుంది.అయితే ఈ చిత్రం ఇప్పుడు నుంచి సన్ నెక్స్ట్ స్ట్రీమింగ్ యాప్ లో అధికారికంగా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ చిత్రాన్ని మీకు సన్ నెక్స్ట్ లో సబ్స్క్రిప్షన్ లేనట్టయితే జియో యూజర్లకు మాత్రం జియో సినిమా యాప్ లో చూడొచ్చు. ఒకవేళ అప్పుడు మిస్సయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు చూసెయ్యండి.