బిగ్ బాస్3: “రాహుల్ ఫేక్ ఎలిమినేషన్” వెనక ఇన్ని నిజాలు దాగి ఉన్నాయా?

Sunday, September 22nd, 2019, 10:17:33 AM IST

బిగ్ బాస్ 3 రియాలిటీ షో ప్రేక్షకుల అదరణని విపరీతం గా పొందుతుంది. గడిచిన ఎపిసోడ్స్ చూసినట్లయితే, ఇన్ని రోజులు ఫన్నీ గా, ఫ్రెండ్లీ గా, కొంచెం ఎమోషనల్ గా సాగిన ఈ బిగ్ బాస్ రియాలిటీ షో, శనివారం రాత్రి జరిగిన ఎపిసోడ్ తో ప్రేక్షకుల మతి పోయినట్లయింది. రాహుల్ ఎలిమినేషన ఎంతో నాటకీయం గా సాగింది. ఎలిమినేషన ప్రోమో నుండి, ఎపిసోడ్ ఎండింగ్ వరకు రక్తి కట్టించిన రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ అసలు అలా జరగడానికి గల కారణాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

బిగ్ బాస్ రియాలిటీ షో భారతదేశం లో చాల ఆదరణ పొందుతున్న కార్యక్రమం. తెలుగు లో ఇది మూడవ సీజన్. అయితే రాహుల్ ఎలిమిటేషన్ ద్వారా ఎంతో మంది భావోద్వేగానికి గురయ్యారు. హౌస్ లోని పునర్నవి అయితే భాదతో ఏడ్చేసింది కూడా. వరుణ్ , మిగతా హౌస్ మేట్స్ ని కొంత వరకు కలవరానికి గురి చేసింది. హౌస్ మేట్స్ స్పందన తో పాటు, ప్రేక్షకుల్ని కూడా షాక్ కు గురి చేసారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ రియాలిటీ షో కి గత సీజన్ తో పోలిస్తే ఆదరణ తక్కువే అని చెప్పాలి. ప్రేక్షకుల్ని తమ వైపు తిప్పేందుకు బిగ్ బాస్ ఈ ఫేక్ ఎలిమిటేషన్ ప్రక్రియ చేసినట్లుగా అర్ధం అవుతుంది. ప్రేక్షకులు మాత్రం ఇలా ఫేక్ ఎలిమినేషన్ తో కొంతమేరకు అసహనం గా ఉన్నట్లు అర్ధం అవుతుంది. టైటిల్ రేస్ లో వున్నా వ్యక్తి ని ఎలిమినేషన్ లో చూపించడం చాల మంది నిజమే అని నమ్మడం, ఈ షో పై మరింత చర్చలు జరిగేలా చేసారు బిగ్ బాస్ నిర్వాహకులు.