రేణుదేశాయ్ : బిగ్‌బాస్‌కి హోస్ట్‌గా అయితే ఓకే

Thursday, June 13th, 2019, 04:19:04 PM IST

ప్రస్తుతం తెలుగు రియాలిటీ షోలో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతుంది బిగ్‌బాస్ షో. తక్కువ కాలంలోనే అనూహ్యమైన రేటింగ్‌ను సంపాదించుకోవడంతో ఒక్కసారిగా ఈ ప్రోగ్రాంకు క్రేజ్ పెరిగిపోయింది. అయితే బిగ్‌బాస్ సీజన్ 1 కు జూనియర్ ఎన్‌టీఆర్ హోస్టుగా చేసి తన యాక్టింగ్, యాంకరింగ్‌తో అందరి మనసులు దోచుకున్నాడు. అయితే బిగ్‌బాస్ తెలుగు ప్రజలకు కొత్తే అయినా జూనియర్ ఎన్‌టీఆర్ హోస్టింగ్ వలన మంచి పేరు సంపాదించుకుంది. అయితే బిగ్‌బాస్ సీజన్ 2 కు నాని హోస్ట్‌గా చేసి పర్వాలేదనిపించాడు.

అయితే ప్రస్తుతం మూడో సీజన్‌లోకి అడుగుపెడుతుంది బిగ్ బాస్ షో. అయితే ఈ సారి హొస్ట్‌గా హీరో నాగార్జున రాబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా రేణూ దేశాయ్, సావిత్రి, ఉద‌య భాను , కేఏ పాల్ వంటి సెల‌బ్రిటీలు రాబోతున్నరనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై రేణుదేశాయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన నిజాలను భయటపెట్టారు. బిగ్ బాస్3 సీజన్ కోసం తనను చాలా మంది సంప్రదించారని ఇంకా నేను వారికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని నేను కంటెస్టెంట్‌గా రాబోతున్న అంటూ వస్తున్న కథనాలలో వాస్తవం లేదని ఆమె ఆన్నారు. అంతేకాదు ఒక వేళ బిగ్‌బాస్ లోకి అడుగు పెట్టాల్సి వస్తే హోస్ట్‌గా వస్తానని హొస్ట్‌గా చేయడమంటేనే తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె ఓ టీవీ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే రేణుదేశాయ్ మాటలను బట్టి చూస్తుంటే తాను బిగ్‌బాస్3 సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది.