మహేష్ డైలాగ్ తో సరికొత్త షోలో అదరగొట్టిన రోజా.!

Wednesday, February 26th, 2020, 09:52:33 AM IST

ఇన్ని రోజులూ సరికొత్త కొత్త సినిమాలతో బుల్లితెర వీక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ను ప్రతీ వారం ఇచ్చిన జెమినీ టీవీ ఇప్పుడు అంతే స్థాయి ఎంటర్టైన్మెంట్ ప్రతీ రోజు ఇచ్చేందుకు సంసిద్ధం అవుతుంది.షోల పరంగా ఇన్నాళ్లు ఈ ఛానెల్ కాస్త వెనుకపడి ఉంది అన్న టాక్ వినిపించగా ఈసారి ఒకేసారి ఏకంగా ఐదు బ్రాండ్ న్యూ సరికొత్త షోలను తీసుకు వస్తున్నామని తెలిపారు.అలా నిన్ననే అనసూయ యాంకర్ గా చేస్తున్న సరికొత్త షో “తల్లా పెళ్ళామా” వచ్చే సోమవారం నుంచి మొదలు కాబోతుంది అని కన్ఫర్మ్ చేసేసారు.

అలాగే ఇప్పుడు రోజా యాంకర్ గా చేస్తున్న మరో అదిరిపోయే షో టెలికాస్ట్ కు సిద్ధంగా ఉందని వారు తెలుపుతున్నారు.మోడ్రన్ తల్లులు వారి పిల్లలతో చేసే సందడినే ఒక షోగా మలిస్తే ఎలా ఉంటుందో ఈ షో ద్వారా చూడనున్నారు.ఒక్క గ్రామ్ ఎనిమిది మంది మధ్య యుద్ధం తాలుకా బొమ్మ దద్దరిల్లిపోద్ది అంటూ మహేష్ పేల్చిన డైలాగ్ ను రోజా ఈ షో ద్వారా అదరగొట్టేసాడు.మరి ఈ షో కూడా డే రేంజ్ లో ఉంటుందో లేదో ఈ బొమ్మ ఉంటుందో లేదో తెలియాలి అంటే వచ్చే మార్చ్ 3 నుంచి రాత్రి 9:30 గంటలకు ,ఈ జెమినీ టీవిలో టెలికాస్ట్ కాబోయే ఈ “అమ్మ సరిలేరు నీకెవ్వరు” అనే ఈ ప్రోగ్రాం ను మిస్సవ్వకుండా చూడాల్సిందే.