జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన రోజా…

Saturday, August 17th, 2019, 01:05:59 AM IST

వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజా ప్రస్తుతానికి చాలా బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో రోజా తానూ జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి జబర్దస్త్ కామెడీ కార్యక్రమానికి స్వస్తి చెప్పారని వార్తలు వస్తున్నాయి. అయితే దాదాపు ఐదారేళ్లుగా ఈ షో చేస్తున్నటువంటి రోజా ఒక్కసారిగా ఈ కార్యక్రమానికి గుడ్ బై చెప్పడంతో ఈ షో నిర్వాహకులు కాస్త ఇబ్బంది పడుతున్నారని సమాచారం. అయితే ఇదివరకే కొన్ని రోజులు ఈ షో కి రోజా రాకపోయినప్పటికీ కూడా రోజా స్థానాన్ని ఇతర సినిమా స్టార్లు కొందరు భర్తీ చేశారు. కానీ ఎన్నికల తరువాత రోజా మళ్ళీ ఈ షో కి వచ్చారు.

కాగా ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే రోజా మీద ఎక్కువ భారం పడిందని సమాచారం. అంతేకాకుండా తనకు ఇచ్చిన కొత్త అధికారంకి సంబందించిన బాధ్యతలు చక్కగా నిర్వర్తించాలి ఉంది. అయితే రోజా వల్లే ఈ కార్యక్రమానికి ఎక్కువ పేరు వచ్చిందని, కానీ రోజా ఈ షో ని వదలడం వలన ఈ ఈ కార్యక్రమానికి సంబందించిన ప్రేక్షకులు నిరాశ చెందుతారని సమాచారం. కాగా ప్రస్తుతానికి రోజా మిస్సైన నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో నాగబాబు పక్కన శేఖర్ మాస్టర్ జడ్జ్ గా వచ్చారు. అయితే మరి రోజా పూర్తిగా జబర్దస్త్ నుండి తప్పుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.