వినాయక చవితికి డబుల్ ధమాకా ఇవ్వనున్న రోజా -నాగబాబు

Thursday, August 22nd, 2019, 03:36:45 PM IST

ప్రస్తుతం తెలుగు టీవీ ఈటీవీ ఛానల్ అందించు షోలలో జబర్దస్త్ మరియు ఎక్సట్రాజబర్దస్థ్ తో రోజా-నాగబాబు ల జోడి ఎంతో ప్రత్యేకం . షో ఆద్యంతం పెరఫార్మెర్స్ వేసే పంచులకి వీరి నవ్వే హైలెట్ అని చెప్పాలి. వినాయక చవితికి స్పెషల్ షో తో మీ ముందుకి వస్తున్న ఈటీవీ కార్యక్రమం అవును వాళ్లిద్దరూ గొడవ పడ్డారు.షో ఎంట్రీ ఇవ్వడంతోనే రోజా మరియు నాగబాబు లు ఒకరి నవ్వుపై మరొకరు మాట్లాడుకుంటూ,రోజా ఇలా అంటారు న నవ్వు వల్లే షో నడుస్తుందని, అపుడు రోజా మాటలకూ కౌంటర్ గా నాగబాబు గారు నవ్వులనాగబాబు అంటారు కానీ, నవ్వుల రోజా అని అనరు అంటూ కౌంటర్ ఇస్తారు నాగబాబు గారు. ఇక షో అంత బ్యూటిఫుల్ పెరఫార్మన్సులతో పాటుగా ,స్కిట్స్,డాన్స్ పెర్ఫార్మన్స్ కూడా ఆద్యంతం అలరిస్తుందని ప్రోమో వలన అర్ధం అవుతుంది.

ఇక ప్రోమో లోకి వెళ్ళినట్లైతే నవ్వుపై ఇద్దరు సాగించే సంబాషణతో షో మొదలవుతుంది. ప్రదీప్ యాంకరింగ్ నవ్వులు పూయించేలా ఉండటంతో షో డబల్ మజా తో స్టార్ట్ అవుతుంది. శేఖర్ మాస్టర్ ,వర్షిణి, ఆటో రాంప్రసాద్,రవి ఆద్యం అలారించనున్నట్లుగా ప్రోమోలో వుంది. శేఖర్ మాస్టర్ రోజాకి వీరాభిమాని అవ్వడంతో సిగ్గుతో చేసే ఎక్సప్రెషన్స్ చాల క్యూటుగా ఉంటాయి.వర్షిణి వీరిద్దరి నవ్వుని కూరతో పోలుచుతూ వంకాయ టమోటా లో,వంకాయ బావుంటుందా ?లేదా టమోటా బావుంటుందా అంటే ఎలా చెప్తారు అంటూ ప్రదీప్ కి ఆన్సర్ గా ఇస్తుంది. ఆటో రాంప్రసాద్ తన దైన ఆటో పంచులతో 100 రూపీస్ నోట్లను చూపిస్తూ గాంధీగారు ఈ నోటులో నవ్వుతున్నారు,ఈ నోటులో కూడా నవ్వుతున్నారు.ఇందులో ఏది బావుంది అని ప్రదీప్ ని ఎదురు ప్రశ్న వేస్తాడు. నాగబాబు వాడ్ని అడగడం వేస్ట్ అనగానే ఆటో రాంప్రసాద్ రోజా గారి నవ్వే బావుందంటాడు.రవి చాల భిన్నంగా ఆన్సర్ ఇస్తూనే రోజా నాగబాబులను సూర్యుడు,చంద్రులతో పోలుస్తారు.అయినా ప్రదీప్ ఎవరి నవ్వు బావుందంటూ అడుగుతారు. ఆద్యంతం నవ్వులతో మాత్రమే కాకుండా మాస్ డాన్స్ పెర్ఫార్మన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

శేఖర్ మాస్టర్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలోని దిమాక్ ఖరాబ్ సాంగ్ కి మాస్ స్టెపులతో షోని రక్తి కట్టించాడని తెలుస్తుంది. షో లో శేఖర్ మాస్టర్ పెర్ఫార్మన్స్ తర్వాత రోజా-నాగబాబు ఒక అండర్స్టాండింగ్ కి వచ్చి షో ని జబర్దస్త్ తరహాలో చిన్న పిల్లలతో స్కిట్స్ చేయించడం పిల్లలకి కొత్త ఉత్సాహాన్ని అందించేలా ఉందని చెప్పాలి.ఏదేమైనా ప్రోమో ఆద్యంతం నవ్వులతో,శేఖర్ మాస్టర్ డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఈ వినాయక చవితి డబుల్ ధమాకా అని చెప్పాలి. ఈ ప్రోగ్రాం వినాయక చవితి రోజు ఉదయం తొమ్మిది గంటలకు మీ ఈటీవీలో ప్రసారం కానుంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి