అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టిన “రౌద్రం రణం రుధిరం”

Wednesday, March 25th, 2020, 01:53:57 PM IST


భారతదేశపు మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ “రౌద్రం రణం రుధిరం” మోషన్ పోస్టర్ వచ్చేసింది. రామ్ చరణ్ మరియు తారక్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తలపెట్టిన ఈ మహా యాగం భారీ అంచనాలను సంతరించుకుంది. ఈరోజు విడుదల కాబడిన ఈ చిత్రం తాలూకా మోషన్ పోస్టర్ టీజర్ ఇప్పుడు అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టేసింది.

ఈ తెలుగు మోషన్ పోస్టర్ టీజర్ తెలుగు వెర్షన్ ను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు యూట్యూబ్ లో విడుదల చెయ్యగా దానికి 45 నిమిషాల్లోపే లక్ష లైకులకు పైగా వచ్చేసాయి.ఇప్పుడు ఆ కౌంట్ కూడా ఆగడం లేదు.ఇప్పటికే రెండు లక్షల దగ్గరకు వచ్చేసింది కూడా.ఇదిలా ఉండగా మన టాలీవుడ్ లో ఏ మోషన్ పోస్టర్ కు రానంత రెస్పాన్స్ మరియు ఫాస్టెస్ట్ లైక్స్ వచ్చాయని ఇదే ఆల్ టైం రికార్డ్ అని తారక్ మరియు చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో కాలర్ ఎగరేస్తున్నారు.