తెలుగులో “సాహో” బ్లాస్ట్..రెడీగా ఉందా?

Thursday, May 28th, 2020, 05:09:53 PM IST


టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సాహో”. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదల కాబడి డిజాస్టర్ టాక్ తో కూడా 400 కోట్లు కొల్లగొట్టింది. అయినప్పటికీ ఓవరాల్ గా మాత్రం ప్లాప్ గానే మిగిలిపోయింది.

అయినప్పటికీ ఈ చిత్రం ఫుల్ ఆన్ యాక్షన్ తో ఉండేసరికి స్మాల్ స్క్రీన్ పై టెలికాస్ట్ కోసం మన తెలుగు ఆడియన్స్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్ ఆ మధ్య బాగానే డిమాండ్ చేసారు. కానీ అనూహ్యంగా అంత త్వరగా ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేసేందుకు ఏ ఛానెల్ వారు కూడా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఈ చిత్రం స్మాల్ స్క్రీన్ ను హిట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ చిత్రాన్ని హిందీలో జీ నెట్వర్క్ వారు టెలికాస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలా ఇప్పుడు తెలుగులో కూడా ఈ చిత్రం జీ తెలుగు ఛానెళ్ళోనే టెలికాస్ట్ కానున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే ఆ రోజు రానుంది అని ఇప్పుడు టాక్. మరి ఈ చిత్రం ఎలాంటి టీఆర్పీ రాబడుతుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.