సుధీర్ నరకంతో చచ్చిపోదాం అనుకున్న మూమెంట్..!

Tuesday, December 10th, 2019, 02:18:28 PM IST

తెలుగు స్మాల్ స్క్రీన్ కమెడియన్,యాంకర్, ఓ మెజీషియన్ అలాగే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న సుడిగాలి సుధీర్ తాజాగా ఈటీవీ ఛానెల్లో ప్రసారం చేసే ఆలీతో సరదాగా ప్రోగ్రాం కు వచ్చి తన జీవితంలో జరిగిన అనేక అనుభవాలను పంచుకున్నాడు.అయితే అసలు తన జీవితంలో ఇక ఈ బాధ ఎవరికీ రాకూడదు అని నరకం అనుభవించే కన్నా ఇక చచ్చిపోతే బెటర్ అనుకునే ఓ సంఘటన కోసం సుధీర్ తెలిపాడు.

తాను షూటింగ్స్ చేస్తున్న సమయంలోనే తన వెన్ను ఎముక లోపల ఒక నరం దగ్గర చిన్న క్లాట్ ఏర్పడింది అని దాని వల్ల అసలు తాను కనీసం కూర్చోడానికి కూడా వీలయ్యేది కాదని చిన్నగా కదిలినా సరే ప్రాణం పోయేంతలా అది షాక్ కొట్టేదని సుధీర్ తెలిపారు.అలాగే ఇంత బాధ అనుభవిస్తాన్నానని తన ఇంట్లో వాళ్ళ దగ్గర ఏడిస్తే వాళ్ళు ఎక్కడ బాధ పడతారో అని తనకి ఎందుకు ఇలా జరిగింది అని తన కార్ లో కూర్చొని ఏడ్చేవాడిని అని అలా కోపంతో సడెన్ గా ఏమన్నా చేస్తే అప్పుడు కూడా షాక్ కొట్టేది అని అన్నాడు.

కానీ కొన్ని రోజులకి ఆ క్లాట్ సరిగ్గా నరం దగ్గర రావడం వల్ల సర్జరీ చేసే సమయంలో ఏమాత్రం చిన్నగా నరం కట్ అయినా సరే ఇక తన రెండు కాళ్ళు పని చేయకుండా పోతాయని డాక్టర్స్ తెలిపారని ఇంక ఆ సమయంలో అలాంటి నరకం తన జీవితంలో ఎంత పెద్ద శత్రువులు ఉన్నా సరే వారికి రాకూడదని అలా ఆ నరకం అనుభవించే కన్నా చచ్చిపోవాలని అనుకున్నానని సుధీర్ ఆలీ షో ద్వారా తెలిపాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి