‘స్టార్‌మా’లో త్రివిక్రమ్ సంక్రాంతి సందడి..!

Tuesday, January 14th, 2020, 06:57:28 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు చలన చిత్రానికి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించాడు. అయితే ఈ సంక్రాంతికి కూడా బన్నీతో చేసిన అలవైకుంఠపురంలో చిత్రాన్ని మనముందుకు తీసుకువచ్చి మంచి సక్సెస్ టాక్‌ని అందుకున్నాడు.

అయితే ఒకపక్క త్రివిక్రమ్ తీసిన అలవైకుంఠపురంలో థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తుంటే, మరో పక్క టీవీలలో ఈ సంక్రాంతి మూడు రోజులు త్రివిక్రమ్ మునపటి బ్లాక్‌బస్టర్స్ అలరించబోతున్నాయి. స్టార్‌మాలో 14,15, 16 తేదీలలో వరుసగా జులాయి, అత్తారింటికి దారేది, s/o సత్యమూర్తి సినిమాలు ఆయా తేదీలలో సాయంత్రం ఆరుగంటలకు రాబోతున్నాయి. ఏదేమైనా థియేటర్లలో, టెలివిజన్‌లో ఈ సంక్రాంతి సందడి మాత్రం త్రివిక్రమ్ దే అని చెప్పాలి.