“సాహో” రికార్డ్ పై కన్నేసిన “సరిలేరు నీకెవ్వరు”.!

Monday, January 13th, 2020, 12:09:16 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “సరిలేరు నీకెవ్వరు” బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టడమే కాకుండా సరికొత్త లెక్కలను తెలుగు బాక్సాఫీస్ కు పరిచయం చేస్తుంది.అయితే ఈ చిత్రం ఒకపక్క బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగేస్తుంటే మరో పక్క యూట్యూబ్ లో కూడా రికార్డుల జోరును కొనసాగిస్తూనే ఉంది.ఈ చిత్రంపై ఒక్కసారిగా భారీ అంచనాలు ఏర్పడడానికి ఏకైక కారణం ఏదన్నా ఉంది అంటే ఈ సినిమా ట్రైలర్ అని చెప్పాలి.

అసలు ఊహించని రేంజ్ లో కట్ చేసిన పక్కా మాస్ మసాలా ట్రైలర్ గా దీన్ని చిత్ర యూనిట్ కట్ చెయ్యగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో అప్పటి వరకు ఉన్న అంచనాలు ఒకెత్తు ఈ ట్రైలర్ వచ్చాక పెరిగిన అంచనాలు ఒకెత్తు అని చెప్పాలి.అయితే ఈ ట్రైలర్ ఇప్పుడు మరో రికార్డు స్థాయి ఫీట్ ను అందుకుంది.ఈ ట్రైలర్ కు ఇప్పుడు 5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.తెలుగులో ఇప్పుడు “సాహో” 5 లక్షల 14 వేల లైక్స్ తో బాహుబలి 2 ట్రైలర్ తర్వాత లిస్ట్ లో ఉంది.సో సరిలేరు నీకెవ్వరు కి ఇంకో 14 వేల లైక్స్ పెద్ద విషయమేమి కాదు మొత్తానికి మాత్రం ఇప్పుడు సాహో కిందకు వచ్చేయడం ఖాయం అని చెప్పాలి.