అనుకున్నదే జరిగింది..శిల్ప వెళ్ళిపోయింది

Monday, September 16th, 2019, 08:38:41 AM IST

బిగ్ బాస్ హౌస్ లో ఈ ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దాని గురించి రెండు రోజులు ముందుగానే న్యూస్ బయటకు వచ్చింది. సెకండ్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన శిల్ప చక్రవర్తి సెకండ్ వీక్ కి ఎలిమినేషన్ అయ్యింది. మొదటివారం లో నామినేషన్ లో లేదు కాబట్టి సెకండ్ వీక్ దాక అయినా నిలబడింది తప్పితే, లేకపోతే మొదటి వీక్ లో వెళ్లిపోయేది.

శిల్ప ఎలిమినేషన్ గురించి ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు లేవు. కాకపోతే మధ్యలో ఏమి జరగబోతుంది, ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని కోసమే నిన్న ఎపిసోడ్ చూశారు. శనివారం హిమజ సేవ్ అవటంతో ఇక శ్రీముఖి,పునర్నవి,మహేష్,శిల్ప ఉన్నారు. వీళ్లల్లో మొదటిగా శ్రీముఖిని సేవ్ చేసిన నాగార్జున తర్వాత మరో టాస్క్ ఆడించి, మహేష్ విట్టాని సేవ్ చేయటం జరిగింది.

ఇక చివరిలో మిగిలిన పునర్నవిని యాక్టీవిటీస్ ఏరియా లోకి వెళ్ళమని, శిల్ప ని కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళమని చెప్పారు. లోపలికి వెళ్లిన తర్వాత ఎవరి డోర్ ఓపెన్ అయితే వాళ్ళు లీవింగ్ ఏరియాలోకి రావాలని చెప్పాడు. కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లిన శిల్ప డోర్ ఓపెన్ అయ్యి ఆమె లివింగ్ రూమ్ లోకి వచ్చింది. పునర్నవి మాత్రం యాక్టీవిటీస్ ఏరియాలోనే ఉండిపోయింది. అయితే శిల్ప సేవ్ అయ్యినట్లా..? ఎలిమినేట్ అయ్యినట్లా..? అనేది మాత్రం ఎవరికి తెలియదు. చివరికి నాగార్జున శిల్ప ఎలిమినేట్ అని ప్రకటించటంతో ఆమె ఎలిమినేట్ అయ్యింది.