షాకింగ్ : మరో తెలుగు సీరియల్ హీరోకు కరోనా పాజిటివ్.!

Saturday, July 4th, 2020, 09:41:34 AM IST

కరోనా వల్ల పరిస్థితులు బాగోలేవని మన తెలుగులో సీరియల్స్ మరియు సినిమా షూటింగ్ లను దాదాపు మూడు నెలల పాటు నిలిపివేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పలు సడలింపులు మరియు ఆంక్షలతో షూటింగులకు అనుమతి ఇవ్వగా ఇప్పుడు కరోనా ఈ రెండు ఇండస్ట్రీలపై పంజా విసురుతోంది.

పరిస్థితులు ఇంకా సర్దుబాటు కాలేదని గ్రహించే సినిమా వాళ్ళు అనుమతి వచ్చినా షూటింగ్ లకు వెళ్లడం లేదు. కానీ ఊహించని విధంగా టీవీ పరిశ్రమలో మాత్రం కరోనా కల్లోలం రేపుతోంది. గత రెండు వారల్లోనే తెలుగు టాప్ ఛానెల్స్ మరియు టాప్ సీరియల్స్ కు చెందిన నటులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం రేపింది.

ఇప్పుడు ప్రముఖ సీరియల్స్ హీరో మరియు బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ రవికృష్ణ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. దీనితో అతన్ని ఇపుడు క్వారంటైన్ లో ఉంచగా అతనితో ఎవరైతే షూటింగ్స్ లో పాల్గొన్నారో వారంతా కరోనా టెస్టులు చేయించుకుంటున్నారట. అయితే ఇటీవలే స్టార్ మా సీరియల్ “ఆమె కథ” హీరోయిన్ నవ్య స్వామికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇదే సీరియల్ లో రవికృష్ణ హీరోగా చేస్తున్నారు. ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఏది ఏమైనప్పటకీ మాత్రం ఇది టీవి సీరియల్ టీంలలో ఉన్న సిబ్బందుల బాధ్యతా రాహిత్యం వలనే అని చెప్పాలి. ప్రతీ ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంతవరకు పరిస్థితులు వచ్చి ఉండేవి కావు.