బిగ్ న్యూస్ : ఈ టీవీ సీరియల్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్.!

Wednesday, July 1st, 2020, 06:45:19 PM IST

గత ఏడాది చివర్లో ప్రపంచాన్ని పలకరించిన కరోనా వైరస్ ఇప్పుడు ఎవరికీ కునుకు లేకుండా చేస్తుంది. దీని మూలంగా ఎన్నో నష్టాలు వాటిల్లాయి. దీనితో మన తెలుగు సినీ మరియు టెలివిజన్ పరిశ్రమ ఎంతలా నష్టపోయిందో అందరికీ తెలుసిందే.

సరే పర్మిషన్ వచ్చాక యథావిధిగా షూటింగ్స్ మొదలు పెడదాం అంటే టీవీ యాక్టర్స్ ను ఇప్పుడు కరోనా కాటు వేస్తుంది. జస్ట్ కొద్ది రోజుల క్రితమే ఓ సీరియల్ నటుడికి తర్వాత దర్శకునికి ఆ తర్వాత స్టార్ మా ఛానెల్లో ఏకంగా ఓ సీరియల్ హీరోకి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది.

కానీ ఈసారి మన తెలుగులో ఈటీవీ ఛానెల్ ద్వారా “మీనాక్షి” అనే సీరియల్ తో పరిచయం కాబడిన నవ్య కు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది. దీనితో ఈ వార్త విన్న నెటిజన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.