బిగ్ బాస్ : శివజ్యోతికి స్పెషల్ గిఫ్ట్ వచ్చేసింది.!

Wednesday, October 16th, 2019, 12:04:00 PM IST

ఇంకా తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ఫైనల్ స్టేజ్ కు వస్తుండే సరికి బిగ్ బాస్ ఒక్కసారిగా ఇంటి సభ్యులతో సహా ఫాలోవర్స్ ను కూడా ఎమోషనల్ చేసేస్తున్నారు.నిన్నటి నుంచి ఒక్కొక్కరిగా హౌస్ మేట్స్ తాలూకా కుటుంబ సభ్యలను హౌస్ లోకి పంపిస్తూ ఆడియన్స్ కు ఎమోషనల్ టచ్ ఇచ్చారు.అయితే నిన్న అలీ భార్య మరియు వితిక చెల్లెలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కాగా ఈరోజు శివజ్యోతికు సడెన్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

తాజా విడుదల చేసిన ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ లోకి శివజ్యోతి భర్తను పంపారు.హౌస్ మేట్స్ అంతా ఫ్రీజ్ అయ్యి ఉన్న సమయంలో ఒక్కసారిగా శివజ్యోతి భర్త వచ్చే సరికి ఆమె విపరీతంగా ఎమోషనల్ అయ్యిపోయింది.తాను వచ్చేసరికి గట్టిగ హగ్ చేసుకొని ఏడ్చేసింది కూడా ఇక అలాగే అలీ వారిని చూసి సరదాగా సీరియస్ గా చూస్తే మా ఆయన ఉన్నాడు అంటూ ధైర్యంగా వార్నింగ్ ఇవ్వగా అలా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.మరి ఇతను ఒక్కరేనా నిన్నటిలా ఇంకా ఎవరైనా మిగతా వారి కోసం వస్తారేమో చూడాలి.