వాళ్లకి గూబ పగిలే సమాధానం ఇచ్చిన శివజ్యోతి.!

Monday, November 18th, 2019, 12:27:26 PM IST

తెలుగులో మొదలైన అతి కొద్ది కాలంలోనే అత్యంత ఆదరణను సొంతం చేసుకున్న ఏకైక షో “బిగ్ బాస్” కేవలం ఒక 100 రోజులు మాత్రమే కొనసాగే ఈ రియాలిటీ గేమ్ షో తెలుగు స్మాల్ స్క్రీన్ పై ఒక బెంచ్ మార్క్ ను ఏర్పర్చుకుంది.అయితే ఈసారి సరి ఎంతో ఆసక్తికరంగా మొదలవుతుందన్న బిగ్ బాస్ సీజన్ 3 ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా కొన్ని సంచలన ఆరోపణలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

కొంతమంది ఇండస్ట్రీకు చెందిన మహిళలు షో యాజమాన్యం పై తీవ్ర స్థాయి ఆరోపణలు చేసారు.కానీ అలాంటి ఆరోపణలు చేసిన అందరికి గూబ పగిలేలా అదే షోలో కంటెస్టెంట్ గా చేసిన శివజ్యోతి కొన్ని కీలక కామెంట్స్ చేసారు.ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి అభియోగాలపై చర్చ వచ్చినపుడు తన విషయంలో అలాంటివి ఏమి ఎదుర్కోలేదని అయినా షో యాజమాన్యం ఆడవాళ్ళ పట్ల కానీ షూటింగ్ దశలో కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటారని అందుకు ఉదాహరణగా ఒక సంఘటన కూడా చెప్పారు.

పూల్ టాస్క్ చేస్తున్నపుడు అందులో దిగిన తాము అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా ఎలా పడితే అలా ఉన్నామని అప్పుడు ఆ పూల్ లో తాము అంతా తడిచిపోయి ఎలా ఉన్నామో మాకు తెలుసనీ కానీ యాజమాన్యం ఆ షాట్స్ ద్వారా టీఆర్పీ తెచ్చుకోవచ్చని కానీ వారు అలా చెయ్యకుండా నీట్ గా ఎడిట్ చేసి పెట్టారని అలాంటిది వారిపై ఇలాంటి అభియోగాలు చెయ్యడం సరికాదని మైండ్ బ్లోయింగ్ సమాధానం ఇచ్చారు.