ఓ సరికొత్త షోతో శ్రీముఖి ఈజ్ బ్యాక్..అదే ఛానెల్లో.!

Tuesday, November 19th, 2019, 12:24:19 PM IST

బుల్లి తెరపై ఎంతో మంది యాంకర్స్ లో కేవలం అతి కొద్ది మంది మాత్రమే తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఆడియెన్స్ ను అలరించే యాంకర్స్ టాప్ 5 లో ఖచ్చితంగా రాములమ్మ యాంకర్ శ్రీముఖి కూడా ఉంటుంది.స్టార్ మా లో ప్రసారం అయ్యిన “బిగ్ బాస్ సీజన్ 3” గెలుపు అంచుల వరకు వచ్చి చివరి నిమిషంలో ఓటమి పాలయ్యింది.అయితే స్ట్రాంగెస్ట్ ఉమెన్ గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి మళ్ళీ ఎప్పుడు బుల్లి తెర మీదకు ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందా అని ఎంతగానో ఎదురు చూసారు.

అయితే ఇప్పుడు వారందరికీ ఆ సస్పెన్స్ వీడబోతుంది.బిగ్ బాస్ షోలో లౌడ్ స్పీకర్ గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి మళ్ళీ స్మాల్ స్క్రీన్ పైకి అలరించేందుకు వచ్చేస్తుంది.తాను పాల్గొన్న బిగ్ బాస్ షో ను టెలికాస్ట్ చేసిన అదే స్టార్ మా ఛానెల్లో ఒక సరికొత్త షో ద్వారా ఆమె గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.దీనికి సంబంధించిన ప్రోమోనే స్టార్ మా వారు విడుదల చేసారు.మరి శ్రీముఖితో ఎలాంటి ప్రోగ్రాం ను ప్లాన్ చేసారో చూడాలి.