“జబర్దస్త్” జోడి” లోకి ఎంట్రీ ఇచ్చిన రాములమ్మ..!

Friday, June 14th, 2019, 04:30:48 PM IST

తెలుగు ప్రేక్షకుల ఆల్ టైం ఫేవరేట్ షో “జబర్దస్త్” నిరంతరం ఎంతటి వినోదాన్ని పంచుతుందో మన అందరికీ తెలిసిందే.ప్రతీ గురువారం మరియు శుక్రవారం ప్రసారం అయ్యే ఈ రెండు షోలు యూట్యూబ్ లో కూడా మిలియన్ వ్యూస్ ఇట్టే అందుకుంటాయి.అయితే తాజగా ఈటీవీ ప్లస్ ఛానెల్లో ప్రసారం అయ్యే “పటాస్” షో నుంచి శ్రీముఖి తప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే.కానీ ఇప్పుడు జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచింది.

నిన్న జూన్ 13 గురువారం రాత్రి ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్ ఎపిసోడ్ లో శ్రీముఖి హైపర్ ఆది స్కిట్ లో ఎంట్రీ ఇచ్చింది.శ్రీముఖి ఎంట్రీతోనే ఆది తన పంచులు వర్షం కురిపించారు.మాములుగా వాహనం సౌండ్ చేస్తూ వస్తుంది,ఎవరైనా మనిషి సౌండ్ చేస్తూ వస్తారు ఇక్కడ సౌండే సౌండ్ చేస్తూ వచ్చింది అంటూ వేసిన పంచ్ అదిరిందని చెప్పాలి.తాను పెట్టిన “జబర్దస్త్ జోడి” అనే ప్రోగ్రాంకు యాంకర్ గా శ్రీముఖి ఈ స్కిట్ లో కనిపించారు.డాన్స్ ప్రోగ్రాం కాబట్టి అందులో వచ్చిన కంటెస్టెంట్స్ కూడా అద్భుతంగా హాస్యం పండించారు.

పేథాస్ పాటలకు దొరబాబు ఇచ్చిన ఎక్సప్రెషన్స్ అలాగే రాజు మరియు శాంతి స్వరూప్ లు మైఖేల్ జాక్సన్ లా చేసిన పెర్ఫామెన్స్ మరింత నవ్వు తెప్పిస్తాయి.మొత్తానికి ఈ స్కిట్ మాత్రం ఎప్పటిలానే సూపర్ హిట్ గా నిలిచింది.అనసూయ వ్యాఖ్యాతగా నిర్వహించే ఈ షోకు ఎట్టకేలకు నాగబాబు మరియు రోజాలు వారి స్థానాల్లో కనిపించి షో అంతటికి నిండుతనాన్ని తీసుకొచ్చారు.ఇప్పుడు ఈ స్కిట్ యూట్యూబ్ లో కూడా అదరగొడుతుంది.15 లక్షల వ్యూస్ మరియు లైక్స్ ను ఈ స్కిట్ ఇప్పటి వరకు సంపాదించింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి