బిగ్ బాస్ హౌస్ లో అవమానపడ్డ శ్రీముఖి..దెబ్బ ఖాయం

Saturday, September 14th, 2019, 08:57:53 AM IST

బిగ్ బాస్ హౌస్ లో నిన్న ఒక ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ “సీక్రెట్స్ అండ్ లైడ్స్” అనే టాస్క్ జరిగింది . ఇందులో హౌస్ మేట్స్ నీ ఒక్కొక్కరిగా లేదా జంటగా బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తారు. అక్కడ వాళ్ళకి బిగ్ బాస్ కొన్ని పనులు అప్పచెపుతారు. ఆ తర్వాత బయటకు వచ్చి లోపల ఏమి చేశారో వాళ్ళు హౌస్ మేట్స్ కి చెపుతారు. అది నిజమో కాదో మిగిలిన హౌస్ మేట్స్ చెప్పాలి. కరెక్ట్ గా చెపితే డిన్నర్ పార్టీ ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు.

ఈ క్రమంలో మొదట బాబా భాస్కర్, రవికృష్ణ హిమజ, వరుణ్,వితిక లు వెళ్లారు, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత హౌస్ మేట్స్ అందరు కరెక్ట్ గానే చెపుతారు. ఇందులో శ్రీముఖి మెయిన్ లీడ్ తీసుకోని అన్ని చెపుతుంది. ఆ తర్వాత రాహుల్ లోపలి వెళ్లి బయటకు వచ్చి తనకి ఒక సంఘటన జరిగిందని చెపుతాడు. ఆ సమయంలో శ్రీముఖి ఏకంగా రాహుల్ హార్ట్ దగ్గర చెవి పెట్టి ఎదో వింటున్నట్లు విని, నిజమే రాహుల్ చెపుతుంది నిజమే అంటూ స్టేట్మెంట్ ఇస్తుంది.

అక్కడ వున్నవాళ్లలో ముగ్గురు తప్ప మిగిలిన ఏడుగురు కూడా రాహుల్ చెప్పింది నిజమని నమ్మలేదు, కానీ శ్రీముఖి నమ్మకపోతే పార్టీకి బొక్క పడుతుందని పెద్ద అరుస్తూ చెపుతుంది. దీనితో మిగతా వాళ్ళు సరే అంటారు, అప్పటికి వరుణ్ ఒప్పుకోడు, కానీ అవేమి పట్టించుకోకుండా నిజమే అని చెపుతారు. అది తప్పు అవుతుంది దీనితో శ్రీముఖి చేసిన ఓవర్ యాక్షన్ తుస్సుమని పోయింది. ఆ తర్వాత శిల్ప విషయంలో ,మహేష్ విషయంలో ప్రతిసారి రాంగ్ స్టేట్మెంట్ ఇస్తూ వచ్చింది. చివరికి ఎలా అయ్యిందంటే ఆమె మాటలు ఎవరు కూడా పట్టించుకునే స్టేజి లేకుండా పోయింది. దీనితో గల గల మాట్లాడే శ్రీముఖి సైలెంట్ గా ఉండిపోయింది.