రవిపై శ్రీముఖి ఆగ్రహం..అసలు విషయం తెలిస్తే బిత్తరపోతారు

Saturday, September 21st, 2019, 08:44:00 AM IST

బిగ్ బాస్ షో స్టార్ట్ అయినా తర్వాత శ్రీముఖికి బయట మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ అది మెల్ల మెల్ల తగ్గుతూ వస్తుంది. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. బిగ్ బాస్ కి ముందు శ్రీముఖి వేరు. బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి వేరు అనే విధంగా అనిపించింది. ఇక హౌస్ విషయానికి వస్తే నిన్న రవికృష్ణ తో శ్రీముఖి బాబా భాస్కర్ సమక్షములో మాట్లాడుతూ మొన్న నామినేషన్ అయిపోయిన తర్వాత హిమజాని ఎందుకు హాగ్ చేసుకున్నావు. చేసుకొని ఏమి మాట్లాడావు అంటూ అడుగుతుంది.

నేనేమి మాట్లాడలేదు,జస్ట్ హాగ్ చేసుకున్నానని రవికృష్ణ చెపుతాడు. కేవలం హాగ్ మాత్రమే చూసుకున్నావా..? అయినా హాగ్ చేసుకునేది అక్కడ ఏమి జరిగింది..? హిమజ గురించి తెలిసి కూడా నువ్వు హాగ్ చేసుకోవటం అవసరమా..? అది నాకు అసలు నచ్చలేదు అంటూ శ్రీముఖి రవికృష్ణ మీద సీరియస్ అవుతుంది. ఇదంతా వింటున్న బాబా భాస్కర్ కూడా ఏమి మాట్లాడాలో అర్ధం కాకుండా సైలెంట్ గా ఉన్నాడు.

అయినా రవికృష్ణ హిమజాని హాగ్ చేసుకుంటే శ్రీముఖికి వచ్చిన నష్టం ఏమిటో..? హౌస్ లో ఈ వారం ఎలిమినేట్ కోసం హిమజ నామినేట్ అయ్యింది. అందుకే ఓదార్పుగా హాగ్ చేసుకొని గుడ్ లక్ అని చెప్పాడు. ప్రతి వారం నామినేట్ అయినా వాళ్ళకి ఇలాగే గుడ్ లక్ అని చెపుతారు.అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ శ్రీముఖి మాత్రం రవికృష్ణని ఆ విషయంలో పెద్ద తప్పు చేశాడు అన్నట్లు మాట్లాడటం విడ్డురంగా ఉంది.