మరో సరికొత్త సినిమాతో స్టార్ మా.!

Friday, May 29th, 2020, 12:53:46 PM IST


స్టార్ మా ఛానెల్లో ఇప్పుడు కొత్త పాత, తెలుగు హిందీ, ఇంగ్లీష్ సినిమాల మోత మోగుతుంది. వారానికి ఎలా లేదన్నా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అవుతున్నాయి. అలా ఇప్పుడు మరో సరికొత్త చిత్రంతో స్టార్ మా రెడీగా ఉంది.

అదే విశ్వంత్ మరియు హర్షిత హీరో హీరోయిన్లుగా రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించిన ఫీల్ గుడ్ ఫామిలీ ఎంటర్టైనర్ “తోలు బొమ్మలాట”. గత ఏడాది ఆఖరులో విడుదల కాబడిన ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వచ్చే ఆదివారం మధ్యాహ్నం 2న్నర గంటలకు టెలికాస్ట్ కానుంది. ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అప్పుడు మిస్ అయితే ఈ వీకెండ్ కు మంచి ఆప్షన్ గా నిలుస్తుంది.