ఆలీ షోలో సుధీర్ బ్లూపర్స్..ఎవరికీ ఇలా జరగలేదంట.!

Saturday, December 14th, 2019, 12:40:03 PM IST

ఈటీవీ ఛానెల్లో ప్రసారం అవుతున్న షోలలో ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న “ఆలీతో సరదాగా” ప్రోగ్రాం కూడా ఒకటి.అయితే గత వారం ప్రసారం అయిన ఎపిసోడ్ కు సెన్సేషనల్ కమెడియన్ మరియు హీరో సుడిగాలి సుధీర్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.ఈ ఎపిసోడ్ కు యూట్యూబ్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈ షోకు సంబంధించిన బ్లూపర్స్ వీడియోను జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వారు ఇటీవలే యూట్యూబ్ లో పెట్టగా దానికి కూడా కొన్ని గంటల్లోనే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఈ షూటింగ్ ఆఫ్ ది షూట్ లో ఏం చేసారు అనేవి చాలా ఉన్నాయి.అయితే సుధీర్ వచ్చినపుడు అన్ని అతనికి తగ్గ పాటలే వేసారు.దానికి సుధీర్ కూడా డాన్స్ బాగానే వేసాడు.అయితే సుధీర్ వచ్చినపుడు ఆలీ మావాళ్లు పాటలు పెడుతూనే ఉంటారు నువ్ అలా డాన్స్ చేస్తూనే ఉండాలి అని అన్నారు.టెలికాస్ట్ చేసిన ఎపిసోడ్ లో చూపించని ఎన్నో పాటలు పెట్టారు.దీనితో ఆలీ ఈ షోకు ఎంతో మంది వచ్చారు కానీ మొదటి సరిగా సుధీర్ ఒక్కడికే ఇన్ని పాటలు వేసారని అన్నారు.అలాగే వీడియో పేరు చెప్పి ఆలీ ఆడుకున్నవి టెలికాస్ట్ చేసిన ఎపిసోడ్ లో లేనివి కూడా చాలానే ఈ బ్లూపర్స్ వీడియోలో ఉన్నాయి.ఓ సారి ఈ వీడియో కూడా చూసెయ్యండి.