రష్మీ సుదీర్ రిలేషన్ – క్లారిటీ ఇచ్చిన సుధీర్

Thursday, August 22nd, 2019, 02:32:54 AM IST

ప్రస్తుతానికి బుల్లితెరని ఒక రేంజ్ లో ఏలుతున్న జంట అంటే టక్కున గుర్తొచ్చే పేరు రష్మీ సుధీర్… జబర్దస్త్ తో పాటే ఢీ కార్యక్రమంలో కూడా ఈ జంట చక్కగా ప్రేక్షకులను అడ్డుకుంటుంది. కాగా జబర్దస్త్ లో మాత్రం రష్మి యాంకర్.. సుధీర్ కంటెస్టంట్ గా ఉంటున్నారు. అందువలన ఒకరే స్కిట్ చేయగా, ఢీ లో మాత్రం ఇద్దరు కలిసి స్కిట్ చేస్తున్నారు… అయితే వీరిరువురి మధ్యన వచ్చే సన్నివేశాలు కేవలం స్కిట్ వరకే పరిమితం అనే వార్త అందరికి కూడా తెలుసు… కాగా వీరిమధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ చక్కగా కలవడం వలన దాదాపుగా అదే కొనసాగిస్తూ ఉన్నారు డైరక్టర్స్. అయితే ఇక ఎప్పటికి సుధీర్ రష్మి వెంట పడటం ఆమె అతన్ని కాదనడం ఇలానే ప్రతి ఎపిసోడ్ లో చూస్తూ ఉంటాం. కానీ ఈ షో చూస్తున్న వారికి మాత్రం వీరిరువురు కూడా నిజంగానే ఏదైనా రిలేషన్ లో ఉన్నారేమో అనే అనుమానం రాక మానదు…

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుధీర్ మాట్లాడుతూ… వీరిద్దరి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ పై ఒక క్లారిటీ ఇచ్చారు… తను కేవలం షోలో భాగంగా రష్మితో క్లోజ్ గా ఉంటాను తప్ప బయట తనకు రష్మికి చాలా ఏజ్ గ్యాప్ ఉందని, బయట ఎక్కువగా మాట్లాడుకోమని సుధీర్ చెప్పాడు. కేవలం తమని జోడీగా చూపించడం వల్ల షోకి మంచి రేటింగ్ వస్తుందని ప్రోగ్రాం డైరక్టర్స్ అలా స్క్రిప్ట్ రాయిస్తున్నారని సుధీర్ అన్నాడు. అంతేకాకుండా తనని ప్రతి షో లో ఒక అమ్మాయిల పిచోడిలా చూపిస్తారని, కానీ బయట తనకి అంత సీన్ లేదని, పెద్దగా అమ్మాయిలతో మాట్లాడనని సుధీర్ స్పష్టం చేశారు.