యూట్యూబ్ లో మరోసారి అదరగొడుతున్న “సుడిగాలి సుధీర్”.!

Sunday, June 2nd, 2019, 02:44:07 PM IST

ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రాంలలో సుడిగాలి సుధీర్ టీమ్ కు ఉన్న ప్రత్యేకత కోసం కొత్తగా చెప్పనవసరం లేదు.సుధీర్, రామ్ ప్రసాద్ మరియు గెటప్ శ్రీనుల మధ్య జెనరేట్ అయ్యే కామెడీ అంతా ఇంతా కాదు.అందులో భాగంగానే గత మే నెల 31 శుక్రవారం రోజున టెలికాస్ట్ అయిన స్కిట్ ఇప్పుడు యూట్యూబ్ లో అదరగొడుతుంది.పోలింగ్ ఆఫీసర్ గా సుధీర్ దగ్గరకు వచ్చే వింత వింతైన ఓటర్లకు మరియు సుధీర్ కు మధ్య నడిచే సంభాషణలు ఆధ్యంతం హాస్య భరితంగా ఉండడంతో ఈ వీడియో ఒక్క రోజులోనే 2.2 మిలియన్ వ్యూస్ ను ఇట్టే అందుకుంది.

అలాగే ఈ స్కిట్ లో తాగుబోతు గెటప్ లో కనిపించిన శ్రీనుకు మరియు సుధీర్ మధ్య జెనరేట్ అయిన ఫన్ అయితే మరిన్ని ఎక్కువ నవ్వులు పూయించింది.రెండు రూపాయలు సుధీర్ కు ఇచ్చి సులభ్ కాంప్లెక్స్ లా లోపలకి పంపించమనడం అలాగే ఓటింగ్ మెషిన్ దగ్గరకి వెళ్లి పియానో లా వాయించడం వంటివి చాలా బాగా పండాయి,దీనితో ఈ స్కిట్ యూట్యూబ్ లో ఒక్క రోజులోనే 2.2 మిలియన్ వ్యూస్ తో ఇండియా వైడ్ టాప్ 2 ట్రెండింగ్ లో నిలబడింది.రష్మీ యాంకర్ గా చేస్తున్న ఈ ప్రోగ్రాం కు రోజా మరియు ఆలీ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.