మొత్తానికి టాప్ ప్లేస్ లోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్.!

Sunday, June 28th, 2020, 08:09:23 PM IST

ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే మోస్ట్ ఎంటర్టైనింగ్ షోలలో కిర్రాక్ కామెడీ షో “జబర్దస్త్”. ప్రతీ గురువారం టెలికాస్ట్ అయ్యే ఈ షో మన తెలుగులో అపారమైన క్రేజ్ ను సంతరించుకుంది. అయితే దీనికి సక్సెసార్ గా “ఎక్స్ట్రా జబర్దస్త్” ను మొదలు పెట్టగా అది మరింత సూపర్ హిట్ అయ్యింది.

అయితే ఈ షో లో సుడిగాలి సుధీర్ స్కిట్ అంటే కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అలా చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ టెలికాస్ట్ చేసిన ఎపిసోడ్ లో సిడిగాలి సుధీర్ స్కిట్ ఇప్పుడు యూట్యూబ్ ఆల్ టైం నెంబర్ 1 ట్రెండింగ్ లో నిలిచింది. ఒక రోజులో 2.4 మిలియన్ వ్యూస్ సాధించి ఇంకా ట్రెండ్ అవుతుంది. దీనితో సుడిగాలి సుధీర్ క్రేజ్ స్మాల్ స్క్రీన్ విషయంలో అలాగే ఉందని చెప్పాలి.