200 % ఫుల్ ఎంటెర్టైమెంట్..సండే ఇస్ ఫన్ డే..బిగ్ బాస్

Sunday, September 15th, 2019, 02:45:09 PM IST

నిన్నటి (శనివారం) బిగ్ బాస్ ఎపిసోడ్ లో నాగార్జున చాలా వరకు సీరియస్ మూడ్ లోనే ఉన్నాడు, దానికి తగ్గట్లే షో కూడా వేడివేడిగానే సాగింది. పునర్నవి,మహేష్, శ్రీముఖిలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు . ఆ మూడ్ నుండి నిన్న ఎవరు కూడా బయటకు రాలేకపోయారు, అయితే ఈ రోజు(ఆదివారం) మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఎపిసోడ్ నడిచింది. షో స్టార్టింగ్ నుండే నాగార్జున ఫుల్ హుషారుగా కనిపించాడు.

అయితే హౌస్ మేట్స్ మాత్రం మొదట కొంచం ఇబ్బందిగానే ఉన్నారు. కానీ నాగ్ కూల్ గానే మాట్లాడటంతో అందరు ఫ్రీ అయ్యారు. ఇక హౌస్ లో ఈ రోజు సరదా సరదా టాస్క్ లు చేపించాడు. అలాగే ఒక్కో హౌస్ మేట్ గురించి రాహుల్ తో సాంగ్ పాడించి వాళ్లతో డాన్స్ చేపించాడు. ముఖ్యంగా రాహుల్,పునర్నవి మధ్య రీఛార్జి ఎపిసోడ్ అయితే హైలైట్ అనే చెప్పాలి. వాళ్ళ మధ్యలో బాబా భాస్కర్ ఎంట్రీ కూడా సూపర్

అదే విధంగా శ్రీముఖి టాస్క్ లో భాగంగా మాట్లాడుతూ పెళ్లి క్యాన్సిల్ అయితే చెప్పండి. నాకు నా బాయ్ ఫ్రెండ్ నాగార్జున ఉన్నాడని చెప్పటంతో నాగ్ తో సహా అందరు విపరీతంగా నవ్వేశారు..శ్రీముఖి అంటూ నాగార్జున అనేసరికి సారీ సర్ అంటూ శ్రీముఖి చెప్పటం జరిగింది. ఇలా షోలో ఎక్కువ భాగం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేశారు. ఇలా ఎలిమినేషన్ విషయానికి వస్తే శిల్ప చక్రవర్తి ఎలిమినేట్ కావటం దాదాపుగా ఖాయమైంది.