“వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్” గా సందీప్ కిషన్ బ్లాక్ బస్టర్.!

Thursday, October 17th, 2019, 01:44:09 PM IST

గత కొంత కాలం నుంచి టాలీవుడ్ లో సరైన హిట్టు సినిమా కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకరు తన కెరీర్ లో “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో బ్రేక్ ఇచ్చిన చిత్రం పడడానికి చాలా కాలమే పట్టింది.మధ్యలో కొన్ని సినిమాలు చేసినా అవి మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.కానీ ఈ ఏడాది చేసిన “నిను వీడని నీడను నేనే” మాత్రం సందీప్ కిషన్ కు కెరీర్ లో మరో హిట్ చిత్రంగా నిలిచింది.కార్తీక్ రాజు తెరకెక్కించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట కూడా మంచి వసూళ్లను రాబట్టింది.అయితే ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకోడాని సిద్ధంగా ఉందని టెలికాస్ట్ చెయ్యబోతున్న స్టార్ మా ఛానెల్ వారు అధికారికంగా వెల్లడి చేసారు.ఈ అక్టోబర్ 20 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ చిత్రం ప్రసారం కాబోతుంది.హారర్ సస్పెన్స్ మరియు కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇంతకు ముందు మిస్సయ్యినట్టైతే ఇప్పుడు మిస్సవకుండా చూసెయ్యండి.