బిగ్ బాస్ 3లో అసలేమీ జరుగుతుంది..శ్వేతా రెడ్డి విషయంలో నిజమెంత

Sunday, July 14th, 2019, 11:25:07 AM IST

తెలుగులో బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ మరి కొద్దీ రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. అయితే దీనిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ముఖ్యంగా శ్వేతా రెడ్డి ఆరోపణలు సంచనలంగా మారిపోయాయి. కమిట్ మెంట్ అడిగారని, అలాగే తన అగ్రిమెంట్ జిరాక్స్ పేపర్స్ తనకు ఇవ్వలేదని, దీనిపై ఆమె కోర్టుకి వెళ్ళటానికి సిద్ధమైంది. అయితే ఆమె వేసిన కేసు కోర్టులో నిలబడి బిగ్ బాస్ మీద చర్యలు తీసుకునే స్థాయికి వెళ్తుందా అంటే అనుమానమే..

ఎందుకంటే బిగ్ బాస్ దేశ వ్యాప్తంగా వివిధ భాషలో నిర్వహిస్తుంటారు. కాబట్టి బిగ్ బాస్ టీం చాలా గ్రౌండ్ వర్క్ చేసి మరి రంగంలోకి దిగుతుంది. షో కి దాదాపు 40 మందిని సెలెక్ట్ చేసి వాళ్లతో ముందుగా ఓ ప్రిలిమనరీ అగ్రిమెంట్ తీసుకుంటారు. ఇందులో షో సెలెక్ట్ చేయటం, చేయకపోవటం అన్నది బిగ్ బాస్ వాళ్ళ ఇస్తామని ఒక క్లాజ్ తప్పకుండా ఉంటుంది. ఆ నలభై మందిని వివిధ రకాలుగా టెస్ట్ చేసి, అనేక మంది నిపుణుల సమక్షంలో మాట్లాడి ఫైనల్ చేస్తారు. ఫైనల్ కి సెలెక్ట్ చేయటం, చేయకపోయటం అనేది బిగ్ బాస్ వాళ్ళ ఇష్టం.

అయితే ఇలా ఫైనల్ కి సెలెక్ట్ చేసే సమయంలో ఏమైనా “ఇతర” వ్యవహారాలు జరిగి ఉండవచ్చు.శ్వేతా రెడ్డి ఆరోపిస్తున్న రఘు, శ్యామ్ అనేవారు బిగ్ బాస్ షోలో ఒక పార్ట్ కి కో-ఆర్డినేటర్లు మాత్రమే. వీళ్ళ మీద అనేకమంది ఉంటారు. స్టార్టింగ్ లో ఉన్న వీళ్ళు ఏమైనా అనైతిక కార్యక్రమాలు చేస్తే చేయవచ్చు కానీ, పై స్థాయిలో ఇలాంటివి జరిగే ఛాన్స్ అనేది లేదు. ఇక శ్వేతా రెడ్డి కోర్టులో కేసు వేసిన బలమైన సాక్ష్యాలు చూపించవల్సి ఉంటుంది, కానీ ఆమె తన అగ్రిమెంట్ జిరాక్స్ కాపీనే లేదని మాట్లాడుతుంది, మరి ఆమె పెట్టె కేసు ఎలా చెల్లుబాటు అవుతుంది. దీనికి తోడు ఆమెని ఫైనల్ లిస్ట్ లో సెలెక్ట్ చేయటకపోవటం వలనే ఇలా ఆరోపణలు చేస్తుందని బిగ్ బాస్ యాజమాన్యం ఆరోపిస్తుంది.