ఊహించని రీతిలో “సైరా” “అమెజాన్ ప్రైమ్” ప్రింట్..?

Monday, November 18th, 2019, 04:15:17 PM IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. మొత్తం ఐదు భాషల్లో భారీ అంచనాల నడుమ విడుదల కాబడిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.అయితే ఈ చిత్రం ఒక్క తెలుగులో మాత్రమే ఊహించిన స్థాయి వసూళ్లను రాబట్టగలిగింది.అయితే ఈ చిత్రంకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడు నుంచి తీసుకొస్తున్నారని అభిమానులు అడుగుతూనే ఉన్నారు.

అయితే మొదట్లో ఈ సినిమా హిందీ వెర్షన్ ను వచ్చే డిసెంబర్ 6 నుంచి తీసుకురాబోతున్నట్టుగా వార్తలొచ్చాయి.అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం సైరా ప్రింట్ ను ఫుల్ క్లారిటీతో 4K విజువల్ లో అందుబాటులో ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.కానీ ఇంకా కూడా ఒక్క భాషలోనే అందుబాటులోకి వస్తుందా లేక అన్ని భాషల్లోనూ కలిపి వస్తుందా అన్నది చూడాలి.ప్రస్తుతానికి అయితే 4K విజువల్ లో ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.