“ఖైదీ”ను సరికొత్తగా పరిచయం చేస్తున్నారుగా.!

Saturday, February 15th, 2020, 11:26:41 AM IST

గత ఏడాది విడుదల కాబడిన చిత్రాల్లో కంటెంట్ పరంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లు అయినటువంటి చిత్రాల్లో కార్తీ హీరోగా నటించిన థ్రిల్లర్ చిత్రం “ఖైదీ” కూడా ఒకటి.లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అటు తమిళ్ మరియు ఇటు తెలుగు భాషల్లో విడుదలై కాసుల వర్షాన్ని కురిపించింది.

అయితే ఈ చిత్రం తాలూకా తెలుగు వెర్షన్ మాత్రం ఈరోజుల్లో అత్యంత పాపులర్ అయిన డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని తెలుగు ఆడియన్స్ ఎదురు చూసారు.అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్,హాట్ స్టార్ ఇలా ప్రతీ ఒక్కరినీ పదే పదే అడుగుతుండడంతో ఈ చిత్రం మోస్ట్ అవైటెడ్ గా మారింది.కానీ ఎవరు ఊహించని విధంగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయినటువంటి గీతా ఆర్ట్స్ వారు ప్రారంభించిన స్ట్రీమింగ్ యాప్ “ఆహా” ద్వారా సొంతం చేసుకున్నారు.

అయితే ఈ చిత్రానికి వీరు గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు.మాములుగా టెలివిజన్ లో ఏదన్నా సరికొత్త సినిమాను ప్రసారం చేసేటప్పుడు ఆయా ఛానెల్స్ వారు “వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్”అంటూ ప్రమోట్ చేస్తారు.అలాగే ఈ చిత్రానికి కూడా “వరల్డ్ డిజిటల్ ప్రీమియర్” అంటూ సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు.ఈరోజు ఫిబ్రవరి 15 నుంచి ఆహా యాప్ ద్వారా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండనుంది.ఈ చిత్రాన్ని డిజిటల్ వీక్షించాలి అంటే ఆహా లో కొంత సొమ్ము చెల్లించి సబ్ స్క్రిప్షన్ తీసుకోవడం తప్పనిసరి.ఈ చిత్రం ఇప్పటికే బాగా లేట్ అయ్యిపోయింది.నెటిజన్స్ ఏం చేస్తారో చూడాలి మరి.