వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “తెనాలి రామకృష్ణ”.!

Saturday, December 14th, 2019, 05:15:55 PM IST

చాలా కాలం తర్వాత హీరో సందీప్ కిషన్ మంచి హిట్లు అందుకున్న సంవత్సరంగా 2019 నిలుస్తుంది అని చెప్పాలి.తాను నటించిన రెండు చిత్రాలు “నిను వీడని నీడను నేనే” అలాగే రీసెంట్ గా “తెనాలి రామకృష్ణ బిఏబిఎల్” మంచి హిట్టయ్యాయి.దీనితో సందీప్ మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు.అయితే గత నెలలో విడుదల కాబడిన తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ ఇప్పుడు బుల్లితెరపై ప్రసారం అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

సందీప్ మరియు హన్సికలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు.వెండితెరపై సూపర్ సక్సెస్ అయిన ఈ చిత్రం ఇప్పుడు తమ ఛానెల్లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉందని అంటున్నారు స్టార్ మా వాళ్ళు.ఈ చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చెయ్యబోతున్నట్టుగా తెలిపారు.ఒకవేళ సిల్వర్ స్క్రీన్ పై ఈ కామెడీ ఎంటర్టైనర్ ను మిస్సయ్యి ఉంటే స్మాల్ స్క్రీన్ పై మిస్సవ్వకుండా చూసెయ్యండి.