నాగబాబు సరికొత్త షోకు యాంకర్ ఆమేనా..?

Saturday, December 14th, 2019, 01:46:38 PM IST

ప్రస్తుత రోజుల్లో పోటీతత్వం బాగా నెలకొంది.ప్రతీ చిన్న విషయంలో కూడా ప్రతీ ఒక్కరిలో పోటీ వాతావరణం నెలకొనడంతో నెంబర్ 1 స్థానం కోసం అంతా పాకులాడుతున్నారు.అలాంటి రంగాలలో బుల్లితెర రంగం కూడా ఒకటి.ఒక సీరియల్ ను మించిన సీరియల్ ఇతర ఛానెల్లో వచ్చే షో ను మించిన షోను అలాగే ఈవెంట్లను ప్లాన్ చేస్తూనే ఉన్నారు.అయితే ఈ మధ్యనే బుల్లితెర ప్రేక్షకులకు ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.ఇటీవలే నాగబాబు “జబర్దస్త్” షోను వీడి బయటకు వెళ్లిపోయారు.అయినా సరే ఎప్పటిలానే అంతకు మించిన రేంజ్ లోనే ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు “జబర్దస్త్” షో వారు అందిస్తున్నారు.

అయితే నాగబాబు జీతెలుగులో “అదిరింది” అనే కొత్త ప్రోగ్రాంలో కనిపించబోతున్నట్టుగా వారు తెలిపారు.కానీ అధికారికంగా ఈషో తాలూకా మిగతా వివరాలను అయితే ఇంకా బయటపెట్టలేదు.మాములుగా ఓ పెద్ద షోను రన్ చెయ్యాలి అంటే దానికి ఒక సరైన వ్యాఖ్యాత తప్పకుండా కావాలి.అందుకే ఈ షోకు ఒక సెన్సేషనల్ యాంకర్ ను తీసుకున్నట్టుగా సమాచారం.ఈ షోకు జబర్దస్త్ మొట్టమొదటి యాంకర్ అనసూయ భరద్వాజ్ ను ఎన్నుకున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే అదే ఛానెల్లో మరికొన్ని షోలలో అనసూయ కనిపిస్తుండడంతో ఈ షోకు కూడా ఆమెను యాంకర్ గా షో యాజమాన్యం అనుకుంటున్నట్టు తెలుస్తుంది.