యాంకర్ రవి పై మండిపడుతున్న నెటిజన్లు – ఎందుకో తెలుసా…?

Friday, November 15th, 2019, 01:20:45 AM IST

యాంకర్ రవి.. ఈ పేరు వింటేనే ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. ఇకపోతే రవి ప్రస్తుతానికి ఢీ షో లో కనిపిస్తూ అందరిని అలరిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో రవి చేస్తున్న కామెంట్స్ అనేవి పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నాయి. ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ, వారిపైన వేరేవాళ్లను ఉద్దేశించి సంచలనమైన వాఖ్యలు చేస్తుంటాడని అందరు చెప్పుకుంటున్నారు. అయితే తాజాగా విడుదల చేసిన ఢీ ప్రోమోలో యాంకర్ రవి చేసిన కామెంట్స్ ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారాయి. అందులో కూడా సుదీర్ ని సెంటర్ చేశారు యాంకర్ రవి.

కాగా ఒక సమయంలో సుదీర్ ని టార్గెట్ చేసిన రవి మధ్యలో కొబ్బరి మట్ట టాపిక్ తీసుకొచ్చాడు. అయితే సంపూర్ణేష్ బాబు ఇటీవల నటించిన కొబ్బరిమట్ట సినిమాలో కొబ్బరిమట్ట నువ్వే అంటూ సుడిగాలి ని ఎగతాళి చేశాడు. అయితే వీరి మధ్యలో కొబ్బరిమట్ట చిత్రాన్ని తీసుకొచ్చినందుకు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాకుండా వీరి పనేదో వీరు చూసుకోకుండా మధ్యలో సంపూర్ణేష్ బాబు ని లాగడాల్సిన అవసరం ఏముంది అంటూ రెచ్చిపోతున్నారు పలువురు నెటిజన్లు. కాగా యాంకర్ రవి ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి మరి.