శ్రీముఖితో గొడవనా…? స్పష్టం చేసిన మరొక యాంకర్…

Saturday, December 14th, 2019, 03:23:11 PM IST

శ్రీముఖి… ఈ పేరు వింటేనే అందరిలో ఒకరకమైన ఎనర్జీ వస్తుంది. తన అల్లరి, తన పంచులు అన్ని కూడా గుర్తొస్తుంటాయి. దానికి తోడు శ్రీముఖి మొహం మీద కొట్టినట్లే మాట్లాడుతుందని కొందరు చెబుతుంటారు. కాగా ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ షో ద్వారా మరికొంత మంది అభిమానులను సంపాదించుకుందని చెప్పాలి. ఇకపోతే బిగ్ బాస్ కి రావడానికి ముందు ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పటాస్ షో ద్వారా అకస్మాత్తుగా శ్రీముఖి బయటకు వచ్చేసింది. కాగా దానికి కారణం తోటి యాంకర్ రవి తో జరిగిన గొడవలే కారణం అని అప్పట్లో బాగా పుకార్లు వచ్చాయి.

ఇకపోతే వీరిద్దరి మధ్యన గొడవ విషయానికి సంబంధించి వీరిద్దరిలో ఎవరు కూడా స్పందించలేదని చెప్పాలి. కాగా అయితే తాజాగా యాంకర్ రవి, ఒక ప్రత్యేక మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, అసలు శ్రీముఖి కి నాకు మధ్యన ఎలాంటి గొడవ జరగలేదని, తను ఎప్పటికి కూడా నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా శ్రీముఖి చాలా తెలివిగల అమ్మాయి అని, మంచి వాక్చాతుర్యం గల వ్యక్తి అని చెప్పుకొచ్చారు. కాగా వీరిద్దరి మధ్యన గొడవ జరిగింది అని వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ వట్టి పుకార్లేనని యాంకర్ రవి కొట్టిపారేశారు.