బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి..ఇక్కడ నాన్ “అల వైకుంఠపురములో”

Saturday, February 15th, 2020, 08:00:22 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం “అల వైకుంఠపురములో” మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.వరుడు సినిమాలో బన్నీ చెప్పినట్టు కొడితే కూస్మాండం బద్దలయ్యిపోవాలి అన్నట్టు ఈ సినిమాతో బాక్సాఫీస్ కు కొట్టిన దెబ్బ టాలీవుడ్ హిస్టరీలోనే గుర్తుండిపోయే భారీ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ రికార్డులను నెలకొల్పింది.

సంక్రాంతి కానుకగా విడుదల కాబడి ఈ మధ్యలోనే ఎన్నో సినిమాలు వచ్చినా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో 250కు పైగా థియేటర్స్ లో బొమ్మ ఆడుతుంది అంటేనే మనం అర్ధం చేసుకోచ్చు ఈ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ ను అందుకుందో అని.అయితే ఈ చిత్రం వెండితెర మీదకు రాకముందే సంగీత దర్శకుడు థమన్ అందించిన పాటలతో బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా మారిపోయింది.అలా విడుదలైన పాటలు యూట్యూబ్ లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టేశాయి.

ఒకదానిని మించి మరొక పాట ఉండేసరికి వందలాది మిలియన్ వ్యూస్ మరియు లైక్స్ రికార్డులు బన్నీ ఖాతాలో పడ్డాయి.మొదట విడుదల చేసి సెన్సేషనల్ హిట్ అయిన “సామజవరగమన” తర్వాత వచ్చిన “రాములో రాముల” దానిని మించిపోయింది.దానికి దీనికి ఒక నెల గ్యాప్ ఉన్నా సరే రాములో రాముల సాంగ్ అత్యంత వేగంగా 200 మిలియన్ రికార్డు స్థాయి వ్యూస్ ఇది మాత్రం మన తెలుగులో ఏ చిత్రానికి కానీ ఏ హీరోకు కానీ లేని అత్యంత వేగవంతమైన రికార్డులే అని చెప్పాలి.అలా బాక్సాఫీస్ దగ్గర నెలకొల్పిన రికార్డులను “నాన్ బాహుబలి” అని ప్రస్తావించినా యూట్యూబ్ లో రికార్డులను మాత్రం “నాన్ అల వైకుంఠపురములో” రికార్డులే అని చెప్పాలి.