బిగ్ బాస్ : 100 పర్సెంట్ ఎలిమినేషన్ తానే..!?

Saturday, October 19th, 2019, 05:14:27 PM IST

బిగ్ బాస్ మూడవ సీజన్ మొదలయ్యి 90 రోజులు కావస్తుంది.కానీ ఇప్పటి వరకు మాత్రం ఒక కంటెస్టెంట్ అసలు ఎలా కొనసాగిందబ్బా అన్న సందేహం ఇప్పుడు చాలా మందికి ఈ 90 రోజుల్లో మెదులుతూనే ఉంది.ఆ కంటెస్టెంట్ మరెవ్వరో కాదు వరుణ్ సందేశ్ భార్య వితికానే.నిజంగా ఇప్పటికీ చాలా మందికి అసలు వితిక షోలో ఎలా సర్వైవ్ అయ్యిందో అని అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంటారు.

అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అందరూ నామినేషన్ జోన్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే.మరి వీరిలో ఇప్పుడు ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.రెండో వ్యక్తి ఎవరో అన్నదానిపై ఇంకా సరిగ్గా క్లారిటీ రాలేదు కానీ 100 పర్సెంట్ గా అయితే వితిక కన్ఫర్మ్ అని అంతర్గత సమాచారం.రెండో వ్యక్తిగా అయితే అలీ రెజా అని కూడా వినిపిస్తుంది.మరి ఈ ఇద్దరు కన్ఫర్మా లేదా అన్నది రేపటి వరకు ఆగితే తెలిసిపోతుంది.