సుధీర్ బాబుకి “భాగీ” ఆఫర్ ఎలా వచ్చింది.?

Wednesday, March 25th, 2020, 03:24:31 PM IST

మన తెలుగు హీరోల్లో అందులోనూ తమ స్టార్టింగ్ స్టేజ్ లోనే అంతగా ఫేమ్ అందుకోకుండా ఏకంగా బాలీవుడ్ ఆఫర్ ను కొట్టేసిన ఏకైక హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది సుధీర్ బాబే అని చెప్పాలి. తన మొట్ట మొదటి చిత్రమే “భాగీ”.

టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ చిత్రం మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.అయితే అసలు ఎలాంటి స్టార్డం కూడా లేకుండా ఓ బాలీవుడ్ సినిమా అవకాశం దక్కడం అంటే మామూలు విషయం కాదు. కానీ అసలు ఆ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది అనేది ఆలీ హోస్ట్ చేసే “ఆలీతోన్ సరదాగా” షోకు వచ్చి చెప్పారు.

తాను చిన్నప్పటి నుంచి జాకీచాన్ కు పెద్ద ఫ్యాన్ ని అని అయితే ఆయన చిత్రాల్లో ఆయన చేసే స్టంట్స్ తాలుకా వీడియోస్ పెడుతుంటారని అలా తన మొదటి చిత్రం ఎస్ ఎం ఎస్ లో చేసిన స్టంట్స్ ను కూడా పెట్టానని ఆ వీడియో చూసి భాగీ మేకర్స్ నన్ను సంప్రదించగా అలా ఆ చిత్రం ఒకే అయ్యిందని సుధీర్ తెలిపాడు.దీని తర్వాతే బాలీవుడ్ రెండు మూడు ఆఫర్స్ వచ్చాయి కానీ వేరే సినిమాకు ఒప్పుకోడం మూలాన చేయలేకపోయానని తెలిపారు.