ఎవర్ గ్రీన్ : “అమృతం” సీరియల్ ఆగిపోడానికి కారణం అదే.!

Monday, November 18th, 2019, 02:41:08 PM IST

ఇప్పుడు తెలుగులో ఎన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మరియు సీరియల్స్ ఉన్నా సరే అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా తమ దృష్టిలో ఎవర్ గ్రీన్ ఎంటర్టైనింగ్ కామెడీ సీరియల్ ఏదన్నా ఉంది అంటే కళ్ళు మూసుకొని అయినా సరే తెలుగు ప్రేక్షకులు ఎవరైనా చెప్పే పేరు “అమృతం”. తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పటికి కూడా చిరస్థాయిగా నిలిచిపోయే కామెడీ సీరియల్ ఇది.

దాదాపు ఆరేళ్ళు తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సీరియల్ ఆగిపోవడంతో తెలుగు ప్రేక్షకులు అప్పుడు పిల్లలుగా ఉన్న ఇప్పుడు మధ్య వయస్కులు ఎంతో మిస్సవుతున్నారు.అయితే అప్పట్లో నెంబర్ 1 గా ఉన్న ఈ సీరియల్ అసలు ఎందుకు ఆగిపోవాల్సి వచ్చిందో ఆ సీరియల్ నిర్మాత గుణ్ణం గంగరాజు ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

ఈ సీరియల్ అప్పుడు జెమిని టీవిలో ఆరేళ్ళ పాటుగా నెంబర్ 1,2 స్థానాల్లో టీఆర్పీ రేటింగ్ తెచ్చుకునేది అని కానీ మేము ఆపేస్తున్నామని చెప్పినపుడు వారు షాక్ అయ్యారని అన్నారు.అయితే నిజానికి మా దగ్గర అప్పటికి కొత్త ఆలోచనలు స్క్రిప్టులు లేకనే ఆపేశామని అసలు విషయం చెప్పారు.

ఆరేళ్ల పాటు 300 ఎపిసోడ్లు స్క్రిప్ట్ వర్క్ అంటే మాములు విషయం కాదని ఒకటి లేనట్టుగా మరోటి ఉండాలి అప్పటికే వారి ఆలోచనలు అన్ని వాడేసాం కొత్త స్క్రిప్ట్స్ లేకనే ఆపేశామని ఆయన తెలిపారు.కానీ ఈ సీరియల్ తాలూకా ఎపిసోడ్స్ ను యూట్యూబ్ లో ఉంచగా వాటికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చాయి.దీనిని బట్టి “అమృతం” సీరియల్ కు తెలుగు ఆడియెన్స్ ఎంతటి ప్రాధాన్యం ఇచ్చారో మనం అర్ధం చేసుకోవచ్చు.