“అల వైకుంఠపురములో” ఇంత త్వరగా రావడానికి కారణం బన్నీయేనా?

Monday, February 24th, 2020, 09:56:02 AM IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ “అల వైకుంఠపురములో” చిత్రం ఫుల్ హెచ్ డి లో స్ట్రీమ్ అయ్యేందుకు సంసిద్ధంగా ఉంది.పూజ హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికీ సాలిడ్ వసూళ్లను రాబడుతూ ఆశ్చర్యపరుస్తుండగా ఇదే చిత్రాన్ని స్ట్రీమింగ్ వెర్షన్ లో కూడా ఈ ఫిబ్రవరి 26 నుంచే సన్ నెక్స్ట్ లో ప్రసారం చేయబోతున్నామని తెలిపి ఇంకో షాక్ ఇచ్చారు.

విడుదలకు ముందు అంతా అంత త్వరగా అయితే స్ట్రీమింగ్ వెర్షన్ కు ఈ చిరం అందుబాటులో ఉండదు అని చెప్పి ఇప్పుడు సడన్ గా ఇలా చెయ్యడం వెనుక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హస్తమే ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.గతంలో ఈ చిత్రం విడుదల సమయంలో కూడా ఒకరోజు ముందే విడుదల చెయ్యాలని బన్నీ లాస్ట్ లో పట్టుబట్టాడని కూడా వార్తలు వచ్చాయి.అలాగే ఇప్పుడు స్ట్రీమింగ్ వెర్షన్ లో కూడా తానే ముందుండాలని అన్న భావనతో చెప్పడం వల్ల ఇంత త్వరగా వస్తుంది అన్నట్టు తెలుస్తుంది.