“బిగ్ బాస్ 4” హోస్ట్ గా ఈ సెన్సేషనల్ హీరో..?

Wednesday, July 8th, 2020, 11:49:21 AM IST

ఇప్పుడు మనదేశంలో కరోనా వ్యాప్తి అలా కొనసాగుతున్నప్పటికీ ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతున్నారు. అలాగే ఎంటర్టైనింగ్ రంగం కూడా మారిపోయింది. ఇప్పటికే మన తెలుగులో పలు ఎంటర్టైనింగ్ ప్రోగ్రాం లు మొదలయ్యిపోయాయి. అయితే ఈ అన్నింటిలోనూ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ అని చెప్పాలి.

స్టార్ మా లో ప్రసారం అయ్యే ఈ షో మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే నాలుగో సీజన్ హోస్ట్ విషయంలో ఓ బజ్ నడుస్తుంది. ఈ సెన్సేషనల్ షోకు హోస్ట్ గా మళ్లీ కింగ్ నాగార్జున చేస్తారని అలాగే వారి కోడలు సమంత పేరు కూడా ఈ రేస్ లో వినిపించింది. ఇదిలా ఉండగా ఇప్పుడు మన టాలీవుడ్ కు చెందిన మరో సెన్సేషనల్ హీరో పేరు కూడా రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

అతను మరెవరో కాదు టాలీవుడ్ యువతలో ఇప్పుడు మంచి క్రేజ్ తెచ్చుకున్న రౌడి హీరో విజయ్ దేవరకొండ. బిగ్ బాస్ 4 కు హోస్ట్ గా ఇప్పుడు విజయ్ చేయనున్నాడని సరికొత్త టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి.