ఈ ఆదివారం..నందమూరి అభిమానుల సొంతం గెట్ రెడీ.!

Saturday, December 14th, 2019, 08:08:50 AM IST

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఎందరో అగ్ర శ్రేణి హీరోలలో నందమూరి హీరోలు కూడా ముందుంటారు.స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు పరచిన పూల బాటలో వారి కుటుంబం నుంచి ఎందరో హీరోలు తెలుగు ప్రేక్షకులను అలరించారు.అలా ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు.ఇలా తాత నుంచి మనవడి వరకు కూడా నందమూరి కుటుంబాన్ని తెలుగు ప్రేక్షకులు ఆరాధిస్తూనే ఉన్నారు.అయితే రేపు ఆదివారం మాత్రం ఆ నందమూరి అభిమానులకు ఒక స్పెషల్ డే గా బుల్లి తెర టాప్ మోస్ట్ ఛానెల్ జెమినీ మార్చేసింది.

అలనాటి అన్నగారి నుండి అబ్బాయిగారి దాక అందరిని బుల్లితెరపై చూసే అవకాశం మీ సొంతం! చూడటానికి రెడీ అవ్వండి మరి! అని వారు తెలిపారు.నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన తన తండ్రి జీవిత చరిత్ర “యన్.టి.ఆర్” తో మొదలుకొని ఈ ఆదివారాన్ని నందమూరి వారంగా మార్చేశారు.దీనికి నందమూరి అభిమానుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.మరి రేపు ఆదివారం టెలికాస్ట్ కాబోయే సినిమాలను నందమూరి ఫ్యాన్స్ తప్పకుండ మిస్ చెయ్యరని చెప్పాలి.