“బిగ్ బాస్ 4” హోస్ట్ గా ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరి పేర్లు..!?

Saturday, July 4th, 2020, 03:08:46 PM IST

మన తెలుగులో స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయ్యే “బిగ్ బాస్” షో అని చెప్పాలి. ఇప్పటి వరకు మొత్తం మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ గ్రాండ్ షో ఒకదాన్ని మించి మరొకటి సూపర్ సక్సెస్ అయ్యింది.

అయితే ఈసారి నాలుగో సీజన్ కు మాత్రం కాస్త బ్రేక్ పడాల్సి వచ్చింది. ఈ రాబోయే సీజన్ కోసం కూడా చాలా మంది ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంత పెద్ద షో ను ముందుండి నడిపించడానికి ఒక హోస్ట్ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. వారే కీలకం. ఆడియన్స్ ను ఆ హోస్ట్ ఎంత మెప్పించగలిగితే ఈ షో అంత పెద్ద హిట్ అవుతుంది.

అందుకే నాలుగో సీజన్ కాస్త లేట్ గా మొదలైనా హోస్ట్ ఎవరు అన్నదానిపై ఇంకా చర్చ నడుస్తోంది. అయితే ఈసారి సీజన్ కి కూడా కింగ్ నాగార్జునే హోస్టింగ్ చేస్తారని ఓ పక్క వినిపిస్తుండగా మరోపక్క ఇదే ఫ్యామిలీకి చెందిన అక్కినేని కోడలు సమంతా పేరు కూడా గత కొన్ని రోజులుగా వినిపిస్తుంది. హోస్ట్ రేస్ లో ఒకే కుటుంబం నుంచి ఇద్దరి పేర్లు ఉండటం విశేషమే అని చెప్పాలి. మరి వీరిద్దరిలో ఎవరు హోస్ట్ గా కనిపిస్తారో చూడాలి.