పునర్నవికి ఒకే ఒక్క మాటతో బుద్ధి చెప్పిన వరుణ్

Wednesday, September 18th, 2019, 09:11:59 AM IST

బిగ్ బాస్ హౌస్ లో పునర్నవికి ఉండే ఆటిట్యూడ్ హౌస్ లో మరెవరికి లేదని చెప్పాలి. ప్రతి విషయంలో కూడా ఆమె ఆటిట్యూడ్ కనిపిస్తూనే ఉంటుంది. దాని గురించి హౌస్ మేట్స్ ఎంత మంది చెప్పిన కానీ ఆమెలో ఎలాంటి మార్పు రాకపోయేసరికి అందరు వదిలేశారు. చివరికి నాగార్జున కూడా పునర్నవి ఆటిట్యూడ్ గురించి మాట్లాడాడు. మొన్నటి టాస్క్ లో హౌస్ మేట్స్ ఆటిట్యూడ్ మీదే పునర్నవికి సాంగ్ కంపోజ్ చేసి పాడటం జరిగింది.

ఇక తాజాగా హౌస్ పునర్నవి ఆటిట్యూడ్ గురించి డైరెక్ట్ గా ఆమె ముందే వరుణ్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఈ వారం నామినేషన్ విషయంలో ఒకరిని ఒకరు సేవ్ చేసుకుంటూ ఉన్నారు. వరుణ్ కోసం శ్రీముఖి టాటూ వేపించుకుంది. డైనింగ్ టేబుల్ మీద పునర్నవి, రాహుల్ తింటున్న సమయంలో, వితిక వరుణ్ కూడా అక్కడే ఉన్నారు. ఆ సమయంలో వరుణ్ హౌస్ మేట్స్ చేసిన పనులు గురించి మాట్లాడుతున్నాడు. ఇంతలో పునర్నవి అవేమి పెద్ద విషయాలు ఏమి కాదులే, దానికెందుకు పెద్ద ఫీల్ అయ్యి మాట్లాడుతావు అంటూ వెటకారంగా అంటుంది.

దీనితో వరుణ్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, మన కోసం వాళ్ళు ఆ పని చేశారు. నా కోసం శ్రీముఖి టాటూ వేపించుకుంది. అలాంటి వాటి గురించి చెప్పటం తప్పేమి కాదు, ఇలా నువ్వు ఆటిట్యూడ్ చూపించటం కరెక్ట్ కాదు పునర్నవి అంటూ చెప్పాడు. వరుణ్ నుండి అలాంటి మాటలు రావటంతో షాక్ అయినా పునర్నవి మళ్ళీ తనని తాను కవర్ చేసుకోవటానికి వరుణ్ మీద సీరియస్ అవుతుంది. వరుణ్ కూడా ఎక్కడ తగ్గకుండా పునర్నవికి గట్టి సమాధానం ఇచ్చాడు. నిజానికి అందరు పక్కవాళ్ళ కోసం ఎదో ఒకటి చేశారు. కానీ పునర్నవి రాహుల్ విషయంలో ఏమి చేయలేదు. దీనితో అందరి గురించి వరుణ్ గొప్పగా చెప్పేసరికి పునర్నవి ఇగో తట్టుకోలేకపోయింది.