మరోసారి “హిట్”తో రాబోతున్న విశ్వక్.!

Friday, May 29th, 2020, 10:55:23 AM IST


టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో యూత్ కు బాగా కనెక్ట్ అయ్యిన వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకడు. తనదైన యాటిట్యూడ్ తో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే డిఫరెంట్ జాన్రా చిత్రాలను ఎంచుకుంటూ మంచి ఎంటర్టైన్మెంట్ ను కూడా ఇస్తున్నాడు.

అలా లేటెస్ట్ గా అతను నటించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “హిట్”. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సిల్వర్ స్క్రీన్ పై హిట్ అనిపించుకున్న స్మాల్ స్క్రీన్ పై మాత్రం అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. ఈ చిత్రం బాగానే ఉన్నా అప్పుడు ఎందుకో జెమినీ ఆడియన్స్ అంతలా చూడలేదు.

కానీ ఇప్పుడు ఈ చిత్రం మళ్ళీ టెలికాస్ట్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మరోసారి టెలికాస్ట్ చెయ్యనున్నారు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ చిత్రాన్ని అప్పుడు కనుక మిస్ అయితే ఈసారి తప్పకుండ వీక్షించేయ్యండి.