బిగ్‌బాస్3: వరుణ్‌ని వీడిన వితిక.. హౌస్ నుంచి ఎలిమినేట్..!

Sunday, October 20th, 2019, 11:24:37 PM IST

తెలుగు బిగ్‌బాస్ ఎన్నో ఎలిమినేషన్స్, ఎన్నో గొడవల మధ్య మంచి రసవత్తరంగా కనిపిస్తున్న ఈ సీజన్ అప్పుడే క్లైమాక్స్‌కి చేరుకుంది. అయితే ఇప్పటికే హొస్‌లో ఉన్నవారిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారనేది పెద్ద ఆసక్తిగా కనిపించింది. అయితే హౌస్‌లో ఈ వారం ఎలిమినేట్ శ్రీముఖి, రాహుల్, బాబా మాస్టర్ సేవ్ అయ్యారు.

అయితే ఈ వారం ఎంతో హుషారుగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఎప్పటిలాగానే అందరిని సరదాగా నవ్విస్తూ, ఆడిస్తూ ఈ వారం ఎలిమినేట్ ఎవరయ్యారనేది ప్రకటించాడు. అయితే అందరూ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమోనని భయపడినా చివరకు సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే జరిగింది. అయితే ఎప్పటి నుంచో వరుణ్‌ని వీడి వితిక ఎప్పుడు భయటికివస్తుందో అప్పుడే వరుణ్ ఇంకా బాగా గేం ఆడగలడని అనుకున్న ప్రేక్షకుల కల నెరవేరింది. ఎట్టకేలకు బిగ్‌బాస్ హౌస్ నుంచి విథిక ఎలిమినేట్ అయ్యి భయటకు వచ్చేసింది. అయితే వితిక వెళ్ళిపోతుండడంతో వరుణ్ కాస్త బాధపడినా ఇక మిగిలింది కొద్ది రోజులే కాబట్టి వితిక కూడా కాస్త ధైర్యం చెప్పి వెళ్ళింది. ఇక వితిక వెలుతూ వెలుతూ రాహుల్‌పై బిగ్‌బాంబ్ పేల్చి వెళ్ళింది.