బిగ్ బాస్ 3: వితిక చేసిన పని వరుణ్ పై ప్రభావం చూపనుందా?

Monday, October 21st, 2019, 10:12:42 AM IST

బిగ్ బాస్ మూడవ సీజన్ అందరిని ఆకట్టుకుంటుందని చెప్పాలి. నాగార్జున వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాం లో అసలు మజా మొదలయ్యింది. వితిక హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబ్ రాహుల్ పై విసిరింది. అయితే ఈ బిగ్ బాంబ్ ఏంటంటే రాహుల్ ఒక్కడే ఇంట్లోని బాత్రూమ్ లన్నిటిని క్లీన్ చేయాలి. బిగ్ బాస్ ఆపమని అనేవరకు రాహుల్ ఇలా చేస్తూనే ఉండాలి. అయితే ఎంతో తెలివిగా వ్యవహరించే వితిక బిగ్ బాంబు విషయం లో తప్పు చేసిందా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకు ఈ షో లో కూల్ గా తన గేమ్ తాను ఆడుతూ, ప్రేక్షకుల్ని అలరించడం లో రాహుల్ సక్సెస్ అవుతున్నాడు. అయితే వితిక తో ర్యాంక్ విషయం లో శివజ్యోతి గొడవ పడిన విషయం అందరికి తెలిసిందే. వరుణ్ సందేశ్ కూడా శివ జ్యోతి తో గొడవ పెట్టుకున్నాడు. అయితే శివ జ్యోతి మీదనో, వేరే ఇంకెవరో బిగ్ బాంబు పడుతుంది అనుకున్నారు ఫ్యాన్స్. అయితే రాహుల్ మీద వితిక బిగ్ బాంబ్ వేయడం తో వరుణ్ సందేశ్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని తెలుస్తుంది. వరుణ్ సందేశ్ కంటే రాహుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇపుడు పెరిగింది. గేమ్ విషయం లో రాహుల్ బాగా ఆడుతున్నాడు. అయితే ఈ బిగ్ బాంబు విషయం లో రాహుల్ ఇంకా ఫ్యాన్స్ సింపతీ పొందే అవకాశం వుంది.