యాంకర్ రష్మీపై సుధీర్ కు ఉన్న అసలు అభిప్రాయం ఇది..

Tuesday, December 10th, 2019, 12:42:56 PM IST

సుడిగాలి సుధీర మరియు యాంకర్ రష్మిలకు స్మాల్ స్క్రీన్ పై ఉన్న క్రేజ్ వేరే అని చెప్పాలి.ఈ ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే చాలు అనుకునే ఫ్యాన్స్ వీరికి చాలా మందే ఉన్నారు.దానికి తగ్గట్టుగానే వీరిద్దరికి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండడంతో ముఖ్యంగా యూత్ లో ఒక ప్రత్యేకమైన ఆదరణ ఏర్పడింది.దీనితో నిజంగానే ఈ ఇద్దరి మధ్యన ఏదో ఉంది అని వారి అభిమానులే ఏవేవో ప్రచారం చేసారు.అయితే ఆ “ఏదో”అన్నది ఏమిటో తాజాగా సుధీర్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపాడు.

ఈ ప్రోగ్రాం ద్వారా సుధీర్ తనకు రష్మీకు ఉన్న కెమిస్ట్రీ కేవలం ఆన్ స్క్రీన్ వరకే అని అంతకు మించి మా ఇద్దరి మధ్య ఆఫ్ స్క్రీన్ లో ఏం లేదని చెప్పాడు.అలాగే రష్మీ అంటే తనకు ముందు ఫ్రెండ్ గా తెలుసనీ ఇండస్ట్రీలో తన సహచర ఆర్టిస్ట్ గా ఆమె అంటే మొదట్లో గౌరారం ఉండేది అని కానీ ఆ తర్వాత ఆమె ఈ స్థాయికి రావడానికి పడ్డ కష్టాలు ఆమె గత చరిత్ర కోసం తెలిసే సరికి రష్మిపై ఉన్న గౌరవం ఒక్కసారిగా పీక్స్ కు వెళ్లిపోయిందని మా ఇద్దరి మధ్య ఉన్నది బంధాన్ని పేరుతో కాకుండా ఆమెపై నాకున్న అపారమైన గౌరంగా దాన్ని భావిస్తానని సుధీర్ అసలు విషయం బయటపెట్టాడు.