“బిగ్ బాస్” సీజన్ 3 ఆగిపోయిందా..?

Monday, June 3rd, 2019, 08:34:22 PM IST

తెలుగు నాట మొదలైన టీవీ షోలలో అతి తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న షోలలో “బిగ్ బాస్” కూడా ఒకటి. ఇప్పటికే రెండు షోలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ గేమ్ షో కు సంబంధించి మూడవ సీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు.అయితే ఇప్పుడు ఈ షో కు సంబంధించి సమయం దగ్గర పడుతున్నా సరే ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా అధికారికంగా బయటకు రాలేదు.ఆ మధ్యన వచ్చిన వార్తల ప్రకారం ఈ షో వచ్చే జులై నుంచి ప్రారంభం అవుతుందని వార్తలొచ్చాయి.

కానీ ఇప్పుడు జూన్ లోకి వచ్చినా సరే ఎలాంటి అప్డేట్స్ తెలీడం లేదు.దీనితో అసలు ఈసారి బిగ్ బాస్ 3 వ సీజన్ ఉందా లేదాయే అని అంతా అనుకుంటున్నారు.ఇదొక్కటే కాకుండా ఈ షోకు అత్యంత కీలకమైన పార్ట్ హోస్ట్.గత రెండు సీజన్లలో తారక్ మరియు నానీలు కనిపించారు.కానీ ఈ సీజన్లో మాత్రం ఎవరు కనిపిస్తారో అన్నది కూడా ఇంకా తెలీలేదు.ఈసారి హోస్ట్ గా నాగార్జున,వెంకటేష్ మరియు అనుష్కల పేర్లు వినిపించినా అధికారికంగా ఎవరు చేస్తున్నారో ఇంకా తెలీలేదు.దీనితో అసలు ఈసారి బిగ్ బాస్ సీజన్ 3 ఉందా లేదా అని అంతా అనుకుంటున్నారు.